'పెగసస్‌' చిచ్చు, సర్వీస్‌లను షట్‌ డౌన్‌ చేసిన అమెజాన్‌

20 Jul, 2021 11:24 IST|Sakshi

'పెగసస్‌' దెబ్బకు అమెజాన్‌ క్లౌడ్‌ సర్వీస్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌లను షట్‌ డౌన్‌ చేసినట్లు అమెరికన్‌ మీడియా 'వైస్‌' ప్రకటించింది. గత కొద్దిరోజులుగా ప్రపంచ వ్యాప్తంగా పెగసస్‌ పేరు మారు మోగిపోతోంది. ఇజ్రాయిల్‌కు చెందిన టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ తయారు చేసిన పెగసస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను సైబర్‌ నేరస్తులు దొంగిలించారు. ఆ దొంగిలించిన పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో సైబర్‌ దాడికి పాల్పడ్డారు. అయితే ఇప్పుడు ఇదే స్పైవేర్‌ జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో 37 మంది ప్రముఖుల స్మార్ట్‌ ఫోన్లలోని రహస్యాల్ని సేకరించిందనే వార్త దావనంలా వ్యాపించింది. 

స్పైవేర్‌ డేటా సేకరించిన వారిలో రాజకీయ నాయకులు, జర్నలిస్ట్‌లు, ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు, హ్యుమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌లు ఉన్నట్లు అంతర్గత విచారణలో తేలింది. కానీ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ మాత్రం ఈ వార్తల్ని ఖండిస్తోంది. టెర్రరిజంపై ఫైట్‌ చేసేందుకు పెగసెస్‌ను ప్రభుత్వాలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు ఉపయోగిస్తున్నట్లు ప్రకటించింది. 

ఇప్పటికే పెగసెస్‌ పెట‍్టిన చిచ్చు ప్రముఖుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. తాజాగా అమెజాన్‌ సైతం ఎన్‌ఎస్‌ఓతో సంబంధం ఉన్న సర్వీసుల్ని షట్‌డౌన్‌ చేస‍్తున్నట్లు తెలిపింది. అమెజాన్‌కు ఎన్‌ఎస్‌వోకు మధ్య టెక్నాలజీ పరమైన సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌పై పెగసస్‌ ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. నేపథ్యంలో ఈకామర్స్‌ దిగ్గజం తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస‍్తుందో వేచి చూడాల్సి ఉంది.  

చదవండి: భారీగా ఏర్పాటైన కంపెనీలు, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు