20వేల ఉత్పత్తులతో అమెజాన్‌ స్వచ్ఛతా స్టోర్‌.. ఎక్కడో తెలుసా..

3 Feb, 2024 14:45 IST|Sakshi

దిల్లీలో అమెజాన్​ స్వచ్ఛతా స్టోర్‌​ను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. అవసరమైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయడంతోపాటు వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తూ వారికి అవగాహన కల్పించడమే ఈ స్టోర్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. 

ఈ స్వచ్ఛత స్టోర్‌లో వాక్యూమ్ క్లీనర్‌లు, శానిటరీ వేర్, వాటర్ ప్యూరిఫైయర్‌లు, మాప్‌లు, చీపుర్లతో సహా దాదాపు 20,000 క్లీనింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని చెప్పారు.

ఇదీ చదవండి: ఏకధాటిగా 40 గంటలు ఎగిరే డ్రోన్‌.. ఇంకెన్నో ప్రత్యేకతలు

అమెజాన్ ఇండియా కన్జూమర్‌ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ.. ‘క్లీన్ ఇండియా’ అనే ప్రభుత్వ విజన్‌కు మద్దతివ్వడంపట్ల ఆనందంగా ఉందన్నారు. అమెజాన్ ఎప్పుడూ ‘స్మార్ట్ క్లీనింగ్, అందరికీ పారిశుధ్యం అందించడం, పూర్తి పరిశుభ్రత, పర్యావరణ రక్షణ’కు కట్టుబడి ఉందని తెలిపారు. దేశ పారిశుధ్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.

whatsapp channel

మరిన్ని వార్తలు