అంబానీ సోదరి రూ.68 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. ఈమె గురించి తెలుసా?

21 Feb, 2023 12:05 IST|Sakshi
కుమార్తెతో నీనా కొఠారి

అంబానీ కుటుంబం గురించి అందరికీ తెలుసు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం కలిగిన కుటుంబం వారిది. దివంగత ధీరూభాయ్ అంబానీ స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు మరింత విస్తరించారు. వివిధ వ్యాపారాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ప్రసిద్ధి చెందారు. అయితే వారి సోదరీమణుల గురించి ఎక్కువ మందికి తెలియదు. 

ధీరూభాయ్‌ అంబానీకి ముఖేష్, అనిల్‌లతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్. వీరిలో నీనా కొఠారి రూ.68 వేల కోట్ల విలువైన కొఠారి షుగర్స్ అండ్‌ కెమికల్స్ కంపెనీకి అధిపతి. 2003లో ఆమె జావగ్రీన్ అనే కాఫీ, ఫుడ్ చైన్‌ని స్థాపించారు. నీనా కొఠారి 1986లో వ్యాపారవేత్త భద్రశ్యామ్ కొఠారిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్జున్ కొఠారి, కుమార్తె నయనతార కొఠారి ఉన్నారు.

అనారోగ్య కారణాలతో శ్యామ్ కొఠారి 2015లో మరణించారు. ఆ తర్వాత నీనా కొఠారి వారి కుటుంబ వ్యాపారమైన కొఠారి షుగర్స్ అండ్‌ కెమికల్స్ బాధ్యతలను తీసుకున్నారు. 2015లో ఆమె కంపెనీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. కార్పొరేట్ షేర్‌హోల్డింగ్స్‌ ప్రకారం.. నీనా భద్రశ్యామ్ కొఠారి పబ్లిక్‌గా రెండు స్టాక్‌లను కలిగి ఉన్నారు. వాటి నికర విలువ రూ. 52.4 కోట్లకు పైగానే.

మరిన్ని వార్తలు