ఫార్చ్యూన్ 40లో అంబానీ  ట్విన్స్

3 Sep, 2020 17:36 IST|Sakshi

 సీరం సీఈఓ అదార్ పూనవల్లా

బైజూస్  సహ వ్యవస్థాపకుడు రవీంద్రన్

సాక్షి, న్యూఢిల్లీ:  రిలయన్స్ అధినేత  ముకేశ్ అంబానీ  తరువాత అతని సంతానం కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లు ఇషా అంబానీ,  ఆకాష్ అంబానీ (29) అరుదైన ఘనత సాధించారు. 2020 ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో  చోటు దక్కించుకున్నారు.

ఫార్చ్యూన్ మేగజీన్ ప్రచురించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన ′40 అండర్-40′ లో రిలయన్స్ చైర్మన్ బిలియనీర్ ముకేశ్ అంబానీ, నీతా అంబానీ  ట్విన్స్    28 ఏళ్ల ఇషా, ఆకాష్  నిలిచారు. టెక్నాలజీ జాబితాలో ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పేర్లను పొందుపరిచింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి  సవాళ్లను ఈ యువ ఎగ్జిక్యూటివ్‌లు సమర్థంగా ఎదుర్కొన్నారని పేర్కొంది.  సోదరుడు అనంత్, (25) తో కలిసి తమ తండ్రి సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లారని ఫార్చ్యూన్ మేగజీన్ ప్రశంసించింది. 

మరోవైపు కరోనా  వైరస్ వ్యాక్సిన్  తయారీకి అనుమతి  పొందిన ఫార్మా దిగ్గజం,ప్రపంచంలోని అతిపెద్ద టీకాల తయారీ సంస్థ  సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా భారతదేశపు ప్రముఖ విద్యా సాంకేతిక సంస్థ బైజు  సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ (39), ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 ఏళ్లలోపు ప్రభావవంతమైన ఫార్చ్యూన్ వార్షిక జాబితాలో నిలిచారు. ఫైనాన్స్, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ప్రభుత్వ, రాజకీయాలు,  మీడియా, వినోదం అనే ఐదు విభాగాలలో 40మంది ప్రభావవంతమైన వ్యక్తులను గుర్తించి ఈ  వార్షిక  జాబితాను  రూపొందిస్తుంది. 

మరిన్ని వార్తలు