అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్‌, నెట్‌వర్త్‌ గురించి తెలుసా?

31 May, 2023 16:52 IST|Sakshi

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ అని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సందర్బంగా అంబటి రాయుడు ఏం చేయబోతున్నాడు. అతని ఆస్తి, నికర విలువ ఎంత అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.  (యాపిల్‌ లవర్స్‌ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్‌ ఐప్యాడ్‌)

ఫ్యాన్స్ అభిమానంగా రాయుడు అని పిలుచుకునే  ఆల్ రౌండర్‌గా  అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. భారత క్రికెట్ జట్టులో రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ,రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా క్రికెట్‌లోకి ప్రవేశించాడు. 2010లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘకాలం అంటే 2017 దాకా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2013 సీజన్‌లో  ఐపీఎల్‌ టైటిల్‌  సాధనలోనూ, ఆ తరువాత  2018లో సీఎస్‌కే  జట్టులోకి మారిన తరువాత 2018, 2021లో టైటిల్ గెలిచిన కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. (IPL 2023 విజేత, కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?)

నికర విలువు
అంబటి రాయుడు మొత్తం నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు. సంవత్సరానికి రూ 7 కోట్లకు పైనే. ఐపీఎల్‌ ద్వారా లభించిన ఫీజు 6.25కోట్లు. లగ్జరీ కార్ల విలువ 1.5 నుంచి  2 కోట్ల రూపాయలు. అలాగే బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్ల ద్వారా కోటి దాకా  ఆర్జిస్తాడనేది తాజా నివేదికలద్వారా తెలుస్తోంది.  (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?)

అంబటి రాయుడు  ఇల్లు  కార్లు
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లగ్జరీ డిజైనర్ ఇల్లు ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్  పెట్టుబడులు కూడా ఉన్నాయి.   ముఖ్యంగా వికారాబాద్ అనంతగరిలో రిసార్ట్ బిజినెస్, సిద్దిపేట వైపు ఫార్మింగ్ బిజినెస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. అధిక బ్రాండ్ వాల్యుయేషన్‌ కారణంగా గత కొన్నేళ్లుగా అంబటి రాయుడు నికర విలువ 40 శాతం పెరిగిందట. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల ద్వారా  రాయుడి నికర ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది నిపుణుల మాట. వ్యవసాయ చేసుకుంటూ  ఫామ్‌హౌస్‌లో ఎక్కువ సమయం గడుపుతానని ఒక ఇంటర్వ్యూలో అంబటి చెప్పినప్పటికీ ఐపీఎల్‌కు గుడ్‌ బై చెప్పిన తరువాత ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్  ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో చేరతాడనే ఊహాగానాలున్నాయి.

కార్లు : రూ. 1.5 నుంచి 2 కోట్లు
అంబటి రాయుడు కార్ల కలెక్షన్ చాలా చిన్నది.  అయినా ఆడి కారుతోపాటు ప్రపంచంలోని  ది బెస్ట్‌ లగ్జరీ కార్లు  కొన్ని  అంబటి రాయుడు  సొంతం.

కరియర్‌
2004 అండర్-19 ప్రపంచకప్‌లో అంబటి రాయుడు కెప్టెన్‌ ఇంగ్లండ్‌పై అజేయంగా 177 పరుగులు చేసి టైటిల్‌ సాధించాడు వయసు కేవలం 16 ఏళ్లు.  ఇక అప్పటినుంచి మరో సచిన్‌ పేరు తెచ్చుకున్నాడు.తరువాత  హైదరాబాద్ దేశవాళీ జట్టుకు ఎంపిక,  కేవలం 17 సంవత్సరాల వయస్సులో నే ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు . భారత జట్టులో ఎంపికై 2013లో జింబాబ్వేపై మ్యాచ్‌లో  రావడం 63 పరుగులతో  అజేయంగా పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో 203 ఐపీఎల్ మ్యాచులాడిన రాయుడు. 127.26 స్ట్రైక్‌రేట్‌తో 4,329 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

1985, సెప్టెంబర్ 23న గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు అంబటి రాయుడు. 1992లో మూడో తరగతి చదువుతున్నప్పుడే  రాయడిని తండ్రి హైదరాబాద్‌లోని విజయ్ పాల్ క్రికెట్ అకాడమీలో చేర్చించారు. 14 ఫిబ్రవరి 2009న తన స్నేహితురాలు విద్యను పెళ్లి చేసుకున్నాడు రాయుడు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మరిన్ని వార్తలు