అంబ్రేన్‌ నుంచి అదిరిపోయే టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌..!

19 Jan, 2022 21:14 IST|Sakshi

భారతదేశంలో అతిపెద్ద మేక్ ఇన్ ఇండియా మొబైల్ యాక్సెసరీస్ బ్రాండ్‌ అంబ్రేన్‌ తన సరికొత్త డాట్స్‌ మ్యూస్ టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌ 23 గంటలపాటు ప్లేబ్యాక్‌ సమయాన్ని అందిస్తాయి. వీటి ధర రూ.1999గా కంపెనీ పేర్కొంది. ఈ కొత్త టీడబ్ల్యూఎస్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడంతో ఇందులో బూస్ట్ చేసిన డ్రైవర్ల వల్ల 23 గంటల ప్లేటైమ్‌ వస్తుంది. దీనికి 365 రోజుల వారంటీ కూడా ఉంది. ఈ ప్రొడక్ట్ Flipkart, Tata Cliq, భారతదేశంలోని అనేక ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. 

క్లాసిక్ స్టైల్‌తో కూడిన ఈ కాంపాక్ట్ ఇయర్‌బడ్‌లు స్పష్టమైన సంభాషణల కోసం అధిక-నాణ్యత గల ఇన్-బిల్ట్ మైక్రోఫోన్‌లను కలిగి ఉంటాయి. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల పరిధి 10మీ. ఇవి సరికొత్త బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. ఇయర్‌ఫోన్‌లలో గూగుల్ అసిస్టెంట్, సిరి కోసం వాయిస్ యాక్టివేషన్ కూడా ఉంది. అంబ్రేన్ ప్రస్తుతం భారతదేశంలో టీడబ్ల్యూఎస్‌లో బలమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. డాట్స్ సిరీస్లో - డాట్స్ స్లే, డాట్స్ 38, డాట్స్ 11, డాట్స్ ట్యూన్ &నియోబడ్స్ 11 & 33 ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో అంబ్రేన్ డాట్స్ మ్యూస్ టీడబ్ల్యూఎస్‌ కోసం బ్రాండ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నటి నిధి అగర్వాల్‌ సంతకం చేసింది.

(చదవండి: ఎస్‌బీఐ వినియోగదారులకు శుభవార్త..!)

మరిన్ని వార్తలు