భారీ షాక్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌పై అమెరికాలో దావా

23 Nov, 2022 13:34 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రెవ్‌లిమిడ్‌ ఔషధానికి సంబంధించి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌)తో పాటు సెల్‌జీన్, బ్రిస్టల్‌ మయర్స్‌ స్క్విబ్‌ తదితర దేశీ జనరిక్‌ ఔషధ కంపెనీలపై అమెరికాలో యాంటీ–ట్రస్ట్‌ దావా దాఖలైంది.

రెవ్‌లిమిడ్‌ పేటెంట్‌ వివాద పరిష్కార విషయంలో ఆయా సంస్థలు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ నవంబర్‌ 18న ఈ దావా దాఖలైనట్లు డీఆర్‌ఎల్‌ వెల్లడించింది. తమపై ఆరోపణల్లో ఎలాంటి పస లేదని, లిటిగేషన్‌ను దీటుగా ఎదుర్కొంటామని డీఆర్‌ఎల్‌ స్పష్టం చేసింది. 

చదవండి: మరో టెక్‌ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?

మరిన్ని వార్తలు