America Federal Reserve Bank: ప్చ్‌.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్‌!

28 Jul, 2022 07:00 IST|Sakshi

తాజాగా 0.75 శాతం ప్లస్‌

న్యూయార్క్‌: అంచనాలకు అనుగుణంగా యూఎస్‌ కేంద్ర బ్యాంకు ధరల కట్టడికి మరోసారి వడ్డీ రేట్ల పెంపు అస్త్రాన్ని బయటకు తీసింది. తాజాగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును 0.75 శాతం పెంచింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 2.25–2.50 శాతానికి చేరాయి. ద్రవ్యోల్బణ అదుపునకు జనవరి మొదలు జూన్‌ వరకూ వడ్డీ రేటును 1.5 శాతం పెంచింది. నాలుగు దశాబ్దాలలోలేని విధంగా సీపీఐ 9 శాతానికి చేరడంతో ఈ ఏడాది(2022) చివరికల్లా వడ్డీ రేటును 3.4 శాతానికి చేర్చే యోచనలో ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ ఉంది.

ఆర్థిక మాంద్య పరిస్థితులకంటే ధరల అదుపే తమకు ప్రధానమంటూ ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఆరు ప్రధాన కరెన్సీల మారకంలో డాలరు ఇండెక్స్‌ 107ను దాటి కదులుతోంది. రేట్ల పెంపు అంచనాలతో ఈ నెల మొదట్లో రెండు దశాబ్దాల గరిష్టం 109.29ను తాకిన సంగతి తెలిసిందే. అయితే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో ఆర్థిక మాంద్య ముప్పు పొంచి ఉన్నట్లు విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.

చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్‌, ఆమె ఆస్తి ఎంతంటే!

మరిన్ని వార్తలు