బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాలు.. మేడ్‌ ఇన్‌ చైనాకు అమెరికా చెక్‌

22 Oct, 2021 11:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Dangerous Chemicals In China Toys: మేడ్‌ ఇన్‌ చైనా బొమ్మలకు అమెరికా చెక్‌ పోస్ట్‌ వేసింది.  చైనా నుంచి నౌకల్లో చేరిన బొమ్మలను దేశంలోకి రాకుండా అడ్డుకుంది. తాజాగా పోర్ట్‌లోనే సుమారు ఏడు బాక్స్‌ల బొమ్మలను అధికారులు సీజ్‌ చేయడం విశేషం. ఇందుకు కారణం.. బొమ్మల్లో ప్రమాదకరమైన కెమికల్స్‌ను గుర్తించడం!.


చైనా నుంచి వచ్చిన బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాల ఆనవాళ్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు షిప్‌లో వచ్చిన మేడ్‌ ఇన్‌ చైనా బొమ్మల్ని అమెరికా కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. భారత్‌లో బాగా ఫేమస్‌ అయిన లగోరి(స్వీట్‌, పల్లీ.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు) తరహా చైనా మేడ్‌ బొమ్మలూ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. 

జులై 16న చేపట్టిన కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ సేఫ్టీ కమిషన్‌(CPSC), సీబీపీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ప్రమాదకరమైన కెమికల్స్‌ ఉన్న బొమ్మల్ని గుర్తించారు. కొన్ని బొమ్మలకు సీసం, కాడ్మియం, బేరియం పూత పూస్తున్నారని, దానివల్ల పిల్లల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని పేర్కొంటున్నారు వైద్యులు. అంతేకాదు ఆగష్టు 24న చైనా నుంచి షిప్‌ ద్వారా వచ్చిన కొన్ని బొమ్మల్లోనూ ఈ కెమికల్స్‌ ఆనవాళ్లను నిర్ధారించారు. ఈ తరుణంలో అక్టోబర్‌ 4న అమెరికాకు చేరుకున్న చైనా బొమ్మల్ని సీజ్‌ చేయడం విశేషం.

 

మరోవైపు హాలీడే షాపింగ్‌ సీజన్‌ నేపథ్యంలో యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌(సీపీబీ) అప్రమత్తమైంది. అంతేకాదు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేప్పుడు పిల్లల బొమ్మల విషయాల్లో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎఫెక్ట్‌తో చైనా బొమ్మల వర్తకంపై భారీ ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

చదవండి: చైనాలో భారీ కార్పొరేట్‌ పతనం తప్పదా?

మరిన్ని వార్తలు