అధ్యక్షా.. బాస్‌ అంటే ఇట్టా ఉండాలా.. అదిరిపోయే జీతం, బోలెడు బెనిఫిట్స్‌ కూడా..

9 Aug, 2022 19:31 IST|Sakshi

న్యూయార్క్: ఉద్యోగులకు సరిపడా జీతం ఇవ్వకుండా వారితో యంత్రాలుగా పనిచేయించుకుంటున్నారు కొందరు యజమానులు. మరొకొందరైతే ఉద్యోగులను జీతం తీసుకుని బానిస‌లుగా చూస్తున్నారు. అయితే ఇటీవల ట్రెండ్‌ మారుతోంది. తమకు వచ్చిన జాబ్‌ అని కాకుండా నచ్చిన జాబ్‌ చేస్తామని అంటున్నారు ఉద్యోగులు. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా ఓ సీఈఓ ఉద్యోగుల క‌ష్ట‌న‌ష్టాల‌ను అర్ధం చేసుకోవాలని చెబుతున్నాడు. ఉద్యోగులు చేసే పనికి కేవ‌లం జీతం ఇస్తే స‌రిపోద‌ని వారికి తగిన గౌర‌వం కూడా ఇవ్వాలని ఆయన అభిప్రాయం. ఈ విషయాన్నే ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

బాస్‌ అంటే ఇట్టా ఉండాలా..
అమెరికాలోని సీటెల్‌కు చెందిన సీఈఓ త‌న ఉద్యోగుల‌కు ఏకంగా 80,000 డాల‌ర్లు అంటే రూ 63.7 ల‌క్ష‌ల క‌నీస వేత‌నం చెల్లిస్తున్నామని చెప్తున్నారు. అంతేనా తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులు వారికి నచ్చిన ప్రదేశం నుంచి ప‌నిచేసే వెసులుబాటు క‌ల్పించామని, మంచి జీతంతోపాటు బోలెడు బెనిఫిట్స్‌ ఉన్నాయంటూ తెలిపాడు. ఇంకా చెప్పాలంటే వాళ్లకు సౌకర్యాల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.

ఉద్యోగుల‌ పనికి స‌రైన శాలరీ మాత్రం ఇస్తే సరిపోదని, వారిని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉండాలంటున్నాడు. తమ కంపెనీలో ఒక్కో ఉద్యోగానికి త‌మ‌కు 300కు పైగా అప్లికేష‌న్స్ వ‌చ్చాయ‌ని తెలిపాడు. ఉద్యోగుల‌కు స‌రైన వేత‌నం, గౌర‌వం ద‌క్క‌ని చోట ప‌నిచేయాల‌ని ఏ ఒక్క‌రూ అనుకోర‌ని అన్నారు. ఈ ట్విట్‌ పోస్ట్ చేసిన కొన్ని క్ష‌ణాల్లో వైర‌ల్ కాగా నెటిజన్లు పెద్ద‌సంఖ్య‌లో స్పందించారు. మీ లాంటి బాస్‌ ఆధ్వర్యంలో పని చేయడం ఉద్యోగుల అదృషమని యూజ‌ర్లు కామెంట్ చేశారు.

చదవండి: ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. ఇప్పట్లో లేదని కేంద్రం క్లారిటీ!

మరిన్ని వార్తలు