జిమ్‌లకు వెళుతుంటారా?.. అయితే ఈ గ్యాడ్జెట్‌ మీకోసమే!

5 Feb, 2023 11:59 IST|Sakshi

కండలు పెంచడానికి చాలామంది జిమ్‌లకు వెళుతుంటారు. రోజూ కష్టపడి బరువులు ఎత్తుతూ కసరత్తులు చేస్తుంటారు. రోజూ చేసే కసరత్తుల వచ్చే ఫలితమేంటో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు లేదు. ఒకటి రెండు నెలలు గడిస్తే గాని, శరీరంలోని మార్పు స్పష్టంగా కనిపించదు. అయితే, కసరత్తుల వల్ల కండరాల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఎలా? ఇన్నాళ్లూ అలా తెలుసుకోవడానికి వీలు ఉండేది కాదు గాని, ఇప్పుడు ‘ఫిట్టో’ అందుబాటులోకి వచ్చేసింది.

ఇది చేతిలో ఉంటే, వ్యాయామం తర్వాత కండరాల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అమెరికన్‌ కంపెనీ ఆలివ్‌ హెల్త్‌కేర్‌ రూపొందించిన ఈ సాధనం పూర్తిగా డేటా డ్రైవెన్‌ ట్రైనింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌. దీనికి రెండు బటన్స్‌ ఉంటాయి. ఒకటి పవర్‌ బటన్, ఇంకోటి స్కాన్‌ బటన్‌. పవర్‌ బటన్‌ ఆన్‌ చేసుకున్నాక, దీని నుంచి నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఎల్‌ఈడీ లైట్‌ వెలుగుతుంది. ఈ వెలుతురును కండరాల వైపు ప్రసరింపజేస్తూ, స్కాన్‌ బటన్‌ను ఆన్‌ చేసుకుంటే, కండరాల్లోని మార్పులను యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు తెలియజేస్తుంది. దీని ధర 299 డాలర్లు (రూ.24,418) మాత్రమే!

మరిన్ని వార్తలు