పాటలు పాడే ఫ్లాస్కు.. ఓ సారి వింటే మైమరిచిపోవాల్సిందే!

27 Nov, 2022 07:43 IST|Sakshi

ఫ్లాస్కు చాలాకాలంగా అందరికీ తెలిసిన వస్తువే! పానీయాల ఉష్ణోగ్రతలను ఎక్కువసేపు స్థిరంగా ఉంచడానికి ఫ్లాస్కులను ఉపయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రయాణాల్లో ఫ్లాస్కులు ఎక్కువగా అవసరమవుతాయి. సుదూర ప్రయాణాల్లో బోరు కొట్టకుండా ఉండటానికి చాలామంది సంగీతం వింటుంటారు. ప్రయాణంలో సంగీతం వినడానికి మరో సాధనం అవసరమవుతుంది.

ఫొటోలో కనిపిస్తున్న ఈ ఫ్లాస్కు వెంట ఉంటే, దీనితోనే సంగీతం కూడా వినొచ్చు. ఇందులో కోరుకున్న పానీయాన్ని నింపుకొని తీసుకుపోవచ్చు. అలాగే, దీనిలో అమర్చి ఉన్న బ్లూటూత్‌ స్పీకర్‌ ద్వారా కోరుకున్న పాటలు కూడా దారిపొడవునా వింటూ ప్రయాణాన్ని ఆహ్లాదభరితంగా సాగించవచ్చు. ఇందులోనే అమర్చి ఉన్న ఫ్లాష్‌ లైట్‌ మరో ఆకర్షణ. అమెరికన్‌ కంపెనీ ‘వీఎస్‌ఎస్‌ఎల్‌’ ఇటీవల ఈ ఫ్లాస్కును మార్కెట్‌లోకి తెచ్చింది. దీని ధర 115 డాలర్లు (రూ.9,390) మాత్రమే! 

చదవండి: సేల్స్‌ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెక​ను లాభం రూ. 1.48 లక్షలు!

మరిన్ని వార్తలు