ప్రపంచంలో అత్యంత పొడవైన కారును చూశారా..!

18 Nov, 2021 20:44 IST|Sakshi

మనకు కన్పించే కార్ల పొడవు ఎంతగా ఉంటుంది...మామూలుగా ఐతే సగటు కార్ల పొడవు సుమారు 14.7 అడుగులుగా ఉంటుంది. కొన్ని కార్ల పొడవు సుమారు 15-16 అడుగులుగా ఉంటాయి. 100 అడుగుల పొడవైన కారును ఎప్పుడైన మీరు చూశారా..! 100 అడుగుల కారు ఎక్కడైనా ఉంటుందా...అని కోపంగా తింటుకుంటున్నారా...అయితే మీరు అక్కడే ఆగండి..? చూడటానికి రైళ్లు లాగా ఉండే 100 అడుగుల కారు గురించి  తెలుసుకుందాం..!

అమెరికన్‌ డ్రీమర్‌..! 
1986లో ఒక కారు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది.ఈ కారు  పొడవు సుమారు 100 అడుగులు. ఈ వన్-ఆఫ్ రికార్డ్ లెంగ్త్ లిమోసిన్‌ను అమెరికన్ డ్రీమ్‌గా పిలుస్తారు. దీనిని లిమోసిన్ అని కూడా అంటారు. 

అమెరికన్ డ్రీమ్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం...!
అమెరికన్‌ డ్రీమర్‌ కారులో ఏకంగా హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వడం కోసం ఏకంగా హెలిప్యాడ్ కూడా ఉంది. అంతేకాకుండా  మినీ గోల్ఫ్ కోర్స్, జాకుజీ, బాత్‌టబ్, పదుల సంఖ్యలో టీవీలు, ఫ్రిజ్‌లు ఉన్నాయి. వాటితో పాటుగా ఈ కారులో స్విమ్మింగ్ పూల్  ఉంది. ఈ కారులో సుమారు 70 మంది కూర్చునే అవకాశం ఉంది. ఈ కారు 26 చక్రాలతో నడుస్తుంది.  కారులో లిమోసిన్‌ కారుకు   చెందిన  బహుళ వీ8 ఇంజన్లను ఏర్పాటుచేశారు. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికన్ డ్రీమ్‌ కారును ఏ ఆటోమొబైల్‌ కంపెనీ రూపొందించలేదు. ఈ కారును హాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ వాహన డిజైనర్  జే ఓర్‌బర్గ్ రూపొందించారు. జే ఒర్‌ బర్గ్‌ కార్లను రిమోడలింగ్‌ చేయడంలో సిద్దహస్తుడు. అతను తొలిసారిగా 1980లో అమెరికన్ డ్రీమ్‌ని డిజైన్ చేశాడు.అమెరికన్ డ్రీమ్ ప్రాథమికంగా 1976 కాడిలాక్ ఎల్డోరాడో లిమోసిన్‌ మోడల్‌ కార్‌ ఆధారంగా నిర్మించారు. ఇది  రోడ్లపైకి రావడానికి సుమారు 12 సంవత్సరాలు పట్టింది. 

తొలుత సినిమాల్లో..! 
అమెరికన్‌ డ్రీమ్‌ను మొదట సినిమాల్లో ఉపయోగించే వారు. అంతేకాకుండా పలు ఆటోమొబైల్‌ ఈవెంట్లలో ప్రదర్శించేవారు. 1992 కాలంలో ఈ కారులో తిరిగేందుకు సుమారు గంటకు గంటకు రూ. 14 వేలు చెల్లించాల్సి ఉండేది. ఆ సమయంలో లిమోసిన్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది.  క్రమంగా అది నిర్వహణకు అవసరమైన శ్రద్ధను కోల్పోయింది. అంతే కాకుండా సినిమాల్లో కూడా అంత పొడుగు కార్లకు డిమాండ్ తగ్గింది.  దీనికి భారీ పార్కింగ్ స్థలం అవసరం. దీంతో ఈ కారు మూలకు పడింది. ప్రస్తుతం న్యూయర్క్‌ చెందిన ఓ సంస్థ అమెరికన్‌ డ్రీమ్‌ను తిరిగి పునర్‌వైభవాన్ని తీసుకురావాలని చూస్తోంది. 

చదవండి:  బ్రిటన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇప్పుడు భారత్‌లో..!  ధర ఏంతంటే..?

మరిన్ని వార్తలు