‘బాబోయ్‌ మందు’.. భారీగా పెరిగిన పైనాపిల్‌ ధరలు!

10 Jul, 2021 14:06 IST|Sakshi

‘హమ్ మందు నహీతో బతుకు నయ్ సక్తాహై’.. లాక్‌డౌన్‌ టైంలో చాలామంది మందు బాబులు వెల్లడించిన అభిప్రాయం ఇదే. అంతెందుకు ఫస్ట్‌ వేవ్‌ టైంలో మందు దొరక్క.. శానిటైజర్లు, ఇంట్లోనే మందు ప్రయోగాలతో ఘోరంగా దెబ్బతిన్నవాళ్లూ లేకపోలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో మందు బాబులకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో ఇంట్లోనే బీర్లు తయారు చేసుకుంటున్నారు. దీంతో పైనాపిల్‌ ధరలకు రెక్కలొచ్చాయి. 

సౌతాఫ్రికాలో లాక్‌డౌన్‌ 4 లెవల్‌లో భాగంగా 14 రోజులపాటు లిక్కర్‌ షాపులు మూతపడ్డాయి. దీంతో పైనాపిల్‌ పండ్ల ద్వారా ఇంట్లోనే బీర్లు తయారు చేసుకుంటున్నారు మందుబాబులు. ఈ ప్రభావంతో పైనాపిల్‌ పండ్ల ధరలు 74 శాతం పెరిగాయి. లాక్‌డౌన్‌-మందు దొరకని పరిస్థితుల నేపథ్యంలోనే పైనాపిల్‌కు ఒక్కసారిగా డిమాండ్‌  సౌతాఫ్రికా అగ్రిమార్క్‌ ట్రెండ్స్‌(ఏఎంటీ) గురువారం వెల్లడించింది.

అయితే జూన్‌ చివరి వారం నుంచే లిక్కర్‌పై ఆంక్షలను అమలు చేస్తోంది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. దీంతో అప్పటి నుంచే పైనాపిల్‌ ధరలు స్వల్ఫంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా 14 రోజుల నిషేధం నేపథ్యంలో.. ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ కొనసాగితే మాత్రం పైనాపిల్‌ ధరలు ఊహించని రేంజ్‌కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు