రూ.69 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ కూడా అదుర్స్!

14 Oct, 2021 17:14 IST|Sakshi

ఎలక్ట్రిక్ మార్కెట్ రోజు రోజుకి వేడెక్కిపోతుంది.పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఈవీ తయారీ కంపెనీల పాలిట వరంలా మారింది. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. తాజాగా ఆంపియర్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మాగ్నస్ ఎక్స్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కొత్త స్కూటర్ ధర ₹68,999(ఎక్స్ షోరూమ్, పూణే)గా ఉంది. ఈ కొత్త మాగ్నస్ ఎక్స్ స్కూటర్‌ను ఫుల్ చార్జ్ చేస్తే 121 కిలోమీటర్లు(ఏఆర్ఏఐ పరీక్షించింది) వరకు వెళ్లనుంది. ఈ కొత్త మాగ్నస్ ఎక్స్ ఈ-స్కూటర్‌లో తేలికైన పోర్టబుల్ అధునాతన లిథియం బ్యాటరీ ఉంది.

ఈ బ్యాటరీని ఇంటి వద్ద, ఆఫీసు, కాఫీ షాప్ లేదా ఏదైనా ప్లగ్-ఆన్-ది-వాల్ 5-యాంప్ సాకెట్ ద్వారా సులభంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు కంపెనీ పేర్కొంది. ఇందులో 1200 వాట్స్ మోటార్ ఉంది. ఈ మోటార్ ఇంజిన్ 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకండ్లలో అందుకుంటుంది. దీనిలో రెండు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. ఒకటి సూపర్ సేవర్ ఎకో మోడ్, మరొకటి పెప్పియర్ పవర్ మోడ్. ఈ కొత్త స్కూటర్‌లో ఎల్ఈడి హెడ్ లైట్, కీ లెస్ ఎంట్రీ, వేహికల్ ఫైండర్, యాంటీథెఫ్ట్ అలారం, పోర్టబుల్ బ్యాటరీ రీఛార్జ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మెటాలిక్ రెడ్, గ్రాఫైట్ బ్లాక్, గెలాక్టిక్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

(చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్!)

మరిన్ని వార్తలు