ఆమ్‌వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మీరాబాయి చాను

17 Aug, 2021 15:56 IST|Sakshi

ప్రముఖ న్యూట్రిలైట్ కంపెనీ ఆమ్‌వే ఇండియా తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చానును ప్రకటించింది. ఈ ఒప్పందంపై మీరాబాయి చాను సంతకం చేసింది. న్యూట్రిలైట్ డైలీ, ఒమేగా, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ వంటి ఆమ్‌వే ప్రచారా కార్యక్రమాలలో ఇక నుంచి మీరాబాయి చాను కనిపిస్తుంది. ముఖ్యంగా దేశంలోని మహిళలు, యువతను లక్ష్యంగా చేసుకుని ఆరోగ్యం, పోషకాహార రంగాన్ని ఏకీకృతం చేయడంపై ఆమ్‌వే దృష్టి సారించింది. అందుకోసమే చానుతో సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు మంగళవారం తెలిపింది. (చదవండి: పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు తగ్గించం)

"మీరాబాయి చానుతో మా అనుబంధం ఒక సహజ ఎంపిక. ఆమె ఫిట్ నెస్ పట్ల కనబర్చిన నిబద్ధత సాటిలేనిది. ప్రజలు మరింత మెరుగ్గా, ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము, అందుకే ఆమెను భాగస్వామిగా ఎంచుకునట్లు" ఆమ్‌వే ఇండియా సీఈఓ అన్షు బుధ్రాజా తెలిపారు. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ లో 26 ఏళ్ల చాను మహిళల 49 కిలోల విభాగంలో 204 కిలోల (87 కిలోల+115 కిలోలు) విభాగంలో రజత పతకాన్ని సాధించడంతో దేశమంతా సర్వత్రా ప్ర‌శంస‌ల‌ వర్షం కురుస్తుంది. ఆ తర్వాత ఆమెకు భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు క్యూ కట్టాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు