Anand Mahindra: ఆవిష్కకర్తలకు ఆనంద్‌ మహీంద్రా సవాల్‌? మీరు రెడీనా..

1 Jun, 2022 18:27 IST|Sakshi

సామాజిక అంశాలపై తప్పకుండా స్పందించే ఆనంద్‌ మహీంద్రా ఎమోషనల్‌ అయ్యారు. నిత్యం దేశంలో ఏదో ఒక మూల చోటు చేసుకునే బోర్‌వెల్‌ ప్రమాదాలను చూసి చలించిపోయారు. ఈ సమస్యకు మనందరం పరిష్కారం ఎందుకు చూపలేకపోతున్నాం?  రైతులకు అండగా ఎందుకు ఉండలేకపోతున్నాం? భావి భారత పౌరుల ప్రాణాలను కాపాడేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదంటూ సూటిగా ప్రశ్నించాడు.

మీదగ్గర సొల్యూషన్‌ ఉందా?
ఇటీవల రాజస్థాన్‌లో మూసివేయని బోరుబావిలో పన్నెండేళ్ల బాలుడు పడి మరణించాడు. దీనికి సంబంధించిన న్యూస్‌ క్లిప్‌ను ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు కొత్త ఆవిష్కరణకు దిశా నిర్దేశం చేశారు. నిత్యం ఎక్కడో ఒక చోట బోరుబావిలో పడి చిన్నారులు మరణిస్తున్నారు. ఈ బోరుబావులు మూసేందుకు అవసరమైన కవర్‌ను మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం. మన రైతులు కొనుగోలు చేసేంత తక్కువ ధరలో...వారు తప్పకుండా బోరుబావులను మూసేయాలని నిబంధనలు ఎందుకు తేలేకపోతున్నాం అంటూ ఆనంద్‌ మహీంద్రా ప్రశ్నించారు. ఎవరైనా ఈ సమస్యకు పరిష్కారం చూపించగలరా అంటూ ప్రశ్నించారు. 

సార్‌ ఇటు చూడండి
ఆనంద్‌ మహీం‍ంద్రా వంటి ఇండస్ట్రియలిస్టు నుంచి ఆఫర్‌ రావడంతో దేశీ ఇంజనీర్లు సవాల్‌గా తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే తమ దగ్గరున్న బోరు బావుల కవర్‌లను ఆనంద్‌ మహీంద్రా దృష్టికి తీసుకువస్తున్నారు. మరి వీటిలో ఆయన ఏవి ఎంపిక చేస్తారు? నిజంగానే గ్రామీణ భారతంలో పెనవేసుకుపోయిన ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి. 

మరిన్ని వార్తలు