Anand Mahindra: నితిన్‌ గడ్కారీజీ మనమూ ఇలా చేద్దామా?

7 Apr, 2022 12:44 IST|Sakshi

కేంద్ర రవాణా, ఉపరితల శాఖ మంత్రిగా నితిన్‌ గడ్కారీ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఓవైపు ఈవీ వెహికల్స్‌ని ప్రోత్సహిస్తూనే మరోవైపు గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో స్వయంగా హైడ్రోజన్‌ సెల్‌ కారులో ప్రయాణం చేస్తున్నారు. ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్సీ ఇంజన్ల తయారీపై మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలకు సూచనలు చేస్తున్నారు. కాలుష్య రహిత ఇంధనం కోసం ఇంతలా పరితపిస్తున్న మంత్రి నితిన్‌ గడ్కారీకి ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రా ఓ సూచన చేశారు. 

టర్కీకి చెందిన ఇస్తాంబుల్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. రోడ్లపై వాహనాలు వేగంగా ప్రయాణించినప్పుడు గాలిని చీల్చుకుంటూ వెళ్తాయి. ఈ క్రమంలో గాలులు బలంగా వీస్తాయి. ఈ విండ్‌ ఫోర్స్‌ని ఉపయోగించుకుని కరెంటు ఉత్పత్తి చేసే టర్బైన్లని డెవలప్‌ చేశారు. ఈ టర్బైన్లు గంటకి 1 కిలోవాట్‌ పవర్‌ను జనరేట్‌ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పైలట్‌ ప్రాజెక్టను టర్కీలోని ఇస్తాంబుల్‌ రోడ్లపై చేపట్టారు. 

ఇస్తాంబుల్‌లో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు వీడియోను ఉద్దేశిస్తూ .. ఇండియాలో ఉన్న ట్రాఫిక్‌కి ఈ తరహా ప్రాజెక్టును కనుక చేపడితే ప్రపంచంలోనే విండ్‌ పవర్‌లో ఇండియా గ్లోబల్‌ ఫోర్స్‌గా నిలుస్తుంది. మనదేశంలోని హైవేల వెంట ఇలాంటి  టర్బైన్లు ఏర్పాటు చేద్దామా అంటూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీని అడిగారు ఆనంద్‌ మహీంద్రా.

మరిన్ని వార్తలు