అది నకిలీది.. అలా నేను అనలేదు: ఆనంద్‌ మహీంద్ర

3 Sep, 2021 20:06 IST|Sakshi

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ స్ఫూర్తిదాయకమైన, ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఆనంద మహీంద్రా షేర్ చేసే పోస్టులకు ఎంతో ప్రధాన్యం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక పోస్టులో "మీ జీవితాన్ని మార్చే సలహా ఇది" అంటూ ఆనంద్ మహీంద్రా పేరుతో ఆ పోస్టు తెగ వైరల్ అవుతుంది. అందులో "మిడిల్ స్కూల్ విద్యలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ తప్పనిసరి భోధించాలి కానీ, అలా ఎందుకు చేయడం లేదో నేను చెబుతాను అంటూ" ఉంది. అయితే, ఆ వార్త నకిలిదీ అని ఆనంద్‌ మహీంద్ర పేర్కొన్నారు.(చదవండి: మారుతి సుజుకి కస్టమర్లకు హెచ్చరిక!)

‘‘తెలియని విషయాలు, జ్ఞానాన్ని పంచుకోవడానికి సోషల్‌ మీడియా ఒక సాధనమని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. కానీ, మరోవైపు కొందరు తప్పుడు కోట్స్ ను నాకు ఆపాదిస్తున్నారు. ఇలాంటి విషయాల గురుంచి వీలైనప్పుడల్లా తెలియజేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను.." అని మహీంద్ర ఒక ట్వీట్ చేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు