Anand Mahindra: అద్భుత రికార్డ్‌, అదిరిపోయే చమక్కు

10 Nov, 2022 11:10 IST|Sakshi

సాక్షి,ముంబై:  మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, పాపులర్‌  పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా  రికార్డ్‌ సాధించారు.  సోషల్‌ మీడియాలో​ఎపుడు చురుకుగా ఉండే ఆయన ట్విటర్‌లో ఏకంగా కోటి మంది ఫాలోయర్లను సాధించారు. అంతేకాదు ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ, తనదైన శైలిలో చమత్కరించడం విశేషం. దీంతో పలువురు ఫ్యాన్స్  ఆయనను అభినందనల్లో ముంచెత్తుతున్నారు 

‘‘ఇంత పెద్ద కుటుంబం.. నమ్మలేకపోతున్నాను. ఇది స్పష్టంగా కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుంది. మీ ఆసక్తి, నా పట్ల మీరు చూపిస్తున్న నమ్మకానికి అందరికీ  బిగ్‌ థ్యాంక్స్‌..ఇకపై నాతో కలసే ఉండండి’’ అంటూ  మహీంద్రా  ట్వీట్‌ చేశారు.  అలాగే ఒక  జిఫ్‌ను షేర్‌ చేయడంతో నెటిజన్లు  ఉత్సాహంగా తమ స్పందన  తెలియజేస్తున్నారు.  (మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్‌1బీ వీసా హోల్డర్లలో కలవరం)

కాగా ఆనంద్‌ మహీంద్ర అంటే బిజినెస్‌ వర్గాల్లోనే కాదు, ట్వీపుల్‌లో బాగా పాపులర్‌ అయిన పేరు.  ఎందుకంటే వింతలు, విజ్ఞానం, సైన్స్‌, లేటెస్ట్‌టెక్నాలజీ అంశాలతో పాటు సామాజిక అవగాహన కల్పించే అంశాలను, వీడియోను  ట్విటర్‌లో షేర్‌ చేయడం ఆయనకు అలవాటు.  ఆ స్పెషాలిటీనే కోటి మంది అభిమానులకు చేరువ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని వార్తలు