ధ్యాంక్యూ సార్‌.. ఆనంద్‌ మహీంద్రా ఎమోషనల్‌ రిప్లై

6 Apr, 2022 16:33 IST|Sakshi

ఓ యువతి ట్విట్టర్‌లో చేసిన పోస్టు ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రా కదిలించింది. ఆ యువతి ట్వీట్‌కి బదులిచ్చే క్రమంలో వ్యాపారం, వాణిజ్యం, స్టార్టప్‌ల అసలైన లక్ష్యాలను ఆయన వివరించారు. ఓ వ్యాపారవేత్త ఏం కోరుంటాడు? ఏ లక్ష్యంతో ఓ ఎంట్రప్యూనర్‌ స్టార్టప్‌ స్థాపిస్తాడు? వ్యాపారం యెక్క అసలైన ప్రయోజనం ఏంటనే ప్రశ్నలకు ఒక మెసేజ్‌తో సమాధానం ఇచ్చారు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రా. 

కృతి జైస్వాల్‌ అనే మహిళ 2022 మార్చి 15 ఓ ట్వీట్‌ చేస్తూ.. ‘ఆనంద్‌ మహీంద్రా సార్‌. ఈరోజు నేను ప్రయాణిస్తుంటే మార్గమధ్యంలో కండీవలీ ఈస్ట్‌లో (ముంబై) మహీంద్రా ఫ్యా‍క్టరీ కనిపించింది. మా నాన్న ఆ ఫ్యాక్టరీలోనే పని చేసేవారు. అప్పుడు మేము పాత్రా చావల్‌ నుంచి స్కూల్‌కి వెళ్లేవాళ్లం. ఈ రోజు మా నాన్న రిటైర్‌ అయ్యారు. మేము జీవితంలో చక్కగా సెటిల్‌ అయ్యాం. దీనంతటికి కారణం కండీవలీ ఫ్యాక్టరీ’ అంటూ తన గతాన్ని తెలిపింది.

రెండు వారాలా తర్వాత ఈ ట్వీట్ ఆనంద్‌ మహీంద్రా కంట పడింది. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ఆయన స్పందిస్తూ... ‘ఇలాంటి విషయాలు విన్నప్పుడే ఓ వ్యాపారవేత్తగా సంతోషం కలుగుతుంది. ప్రతీ రోజు ఇంకా బాగా పని చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది. ఎన్నో కలలతో స్టార్టప్‌లు ప్రారంభించే ఎంట్రప్యూనర్లందరి లక్ష్యం కూడా ఇదే. ప్రజల జీవితాల్లో కనిపించే మంచి మార్పే తమ కంపెనీల నిజమైన నెట్‌వర్త్‌ వాళ్లు భావిస్తారు’ అంటూ ఆయన తెలిపారు.

చదవండి: ఎంతో టాలెంట్‌ ఉంది.. కానీ ఏం లాభం.. చూస్తే బాధేస్తోంది!

మరిన్ని వార్తలు