Anand Mahindra: సప్త సముద్రాల్లో సారే జహాసే అచ్చా !

27 Jan, 2022 15:52 IST|Sakshi

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశరాజధాని నడి వీధుల్లో సైనిక కవాతు ఆకట్టుంది. వైమానిక దళం ఆకాశాలంలో అద్భుతాలను ఆవిష్కరించింది. దేశంలో వాడవాడలా ‍త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉద్రిక్తలు ఉండే కశ్మీర్‌ లాల్‌చౌక్‌లోనూ జాతీయ జెండా ఠీవిగా నిలబడింది. వీటికి తోడు సముద్ర గర్భంలోనూ జాతీయ జెండానె ఎగురవేసి తమ దేశభక్తి చాటుకున్నారు స్కూబా డైవర్లు. 


భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటోల్‌ గ్రూప్‌కి చెందిన నలుగురు స్కూబా డైవర్ల బృందం జాతీయ జెండాతో సముద్రం గర్భంలోకి అడుగుపెట్టింది. సముద్రం చిట్టచివరి పాయింట్‌కి చేరుకుని అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేస్తూ..  అన్నిద్వీపాల్లో.. అన్ని సముద్రాల్లో.. సారే జహాసే అచ్చా అంటూ క్యాప్షన్‌ జోడించారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో ఆకట్టుకుంటోంది.

చదవండి: వారి కోసం ప్రత్యేకం.. పెద్ద మనసు చాటుకున్న​ ఆనంద్‌ మహీంద్రా

>
మరిన్ని వార్తలు