వాట్ ఆన్ ఐడియా స‌ర్‌జీ.. ఇలా చేస్తే సైక్లింగ్ బూమ్ రావచ్చు: Anand Mahindra

2 Mar, 2022 17:19 IST|Sakshi

ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా యాక్టివ్‌గా ఉంటూ కీలక అంశాలపై స్పందిస్తారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. నెటిజ‌న్ల‌తో ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చిస్తూనే ఉంటారు. క‌రెంట్ అఫైర్స్ మీద‌, స్ఫూర్తినిచ్చే క‌థ‌నాలు ఇలా అన్ని విష‌యాల‌పై ఆనంద్ ట్వీట్లు చేస్తుంటారు. అయితే, తాజాగా ఆనంద్ మ‌హీంద్రా మరొక పోస్టు చేశారు. దేశవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ కవరేజీని పెంచడానికి ఊదేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. 

తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ.."వాట్ ఆన్ ఐడియా స‌ర్‌జీ.. మా దేశంలో సోలార్ ఉత్పత్తి కోసం కాలువలపై సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ నిర్మిస్తాము, కానీ మీ ఐడియా మాత్రం సోలార్ ఎనర్జీ కవరేజీని గణనీయంగా పెంచుతుంది. సైక్లిస్టులు ఎక్స్ ప్రెస్ వేలను ఉపయోగించకుండా చూడటం విలువైనది.. ఎవరికి తెలుసు, బహుశా ఇది సైక్లింగ్ బూమ్ క్రియేట్ చేయవచ్చు" అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేస్తూ ఎరిక్ సోల్హిమ్ చేసిన ట్వీట్'ను మహీంద్రా రీట్వీట్ చేశారు.

దక్షిణ కొరియా హైవే మధ్యలో సోలార్ ప్యానెల్స్ అమర్చిన ఒక వీడియోను సోల్హిమ్ పంచుకున్నారు. ఫిబ్రవరి 25న సోల్హిమ్ ట్వీట్ చేస్తూ.. "దక్షిణ కొరియాలో హైవే మధ్యలో ఉన్న సోలార్ ప్యానెల్స్ కింద సైకిల్ మార్గం ఉంది. సైక్లిస్టులు సూర్యుడి నుంచి రక్షించబడతారు. అలాగే, ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడంతో పాటు ఆ దేశం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయగలదు" అని అన్నారు.

(చదవండి: శభాష్ ఎలన్ మస్క్.. బాధితులకు అండగా టెస్లా కంపెనీ..!) 

మరిన్ని వార్తలు