రాముడు మతాన్ని మించిన వ్యక్తి - ఆనంద్ మహీంద్రా

22 Jan, 2024 11:21 IST|Sakshi

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే పారిశ్రాక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టవేళ ఒక ఫోటోను తన ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.

ఈ రోజు నా మండే మోటివేషన్ ఆశ్చర్యం కలిగించలేదు, ఎందుకంటే అయోధ్య రాముడు మతాన్ని మించిన వ్యక్తి, ఒకరి విశ్వాసం ఏమైనప్పటికీ.. మనమందరం గౌరవంగా, మంచి విలువలతో జీవించడానికి అంకితమైన వ్యక్తి భావనకు ఆకర్షితులౌతాము. అతని బాణాలు చెడును, అన్యాయాన్ని దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. రామరాజ్య పాలన అనేది సమాజం ఆకాంక్ష, రామ్ అనే పదం ప్రపంచానికి చెందినదని.. ఆనంద్ మహీంద్రా రాముని ఫోటో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ..

ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్.. వేలమందిని ఆకర్శించింది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. యావత్ భారతదేశం మొత్తం ఈ రోజు రామ నామం జపిస్తోంది. ఈ రోజు అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆనంద్ మహీంద్రా కూడా హాజరుకానున్నారు.

>
మరిన్ని వార్తలు