Anand Mahindra: ఇది మరో ప్యాండెమిక్‌.. ఇండియన్‌ సీఈవో వైరస్‌.. వ్యాక్సిన్‌ కూడా లేదు

30 Nov, 2021 13:03 IST|Sakshi

Indian industrialist Anand Mahindra Counter To Irish Billionaire: ట్విట్టర్‌ సీఈవోగా భారతీయ అమెరికన్‌ పరాగ్‌ అగర్వాల్‌ పగ్గాలు చేపడుతున్నారనే వార్త సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. భారతీయులే కాకుండా అనేక దేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఎలన్‌మస్క్‌ లాంటి వారు ట్విట్టర్‌లో కంగ్రాట్స్‌ తెలిపారు. ఇదే సమయంలో ఐరీష్‌ బిలియనీర్‌, స్ట్రైప్‌ కో ఫౌండర్‌ ప్యాట్రిక్‌ కొలిసన్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తికర చర్చకు దారి తీసింది. 
 
గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్‌ తదితర ఇంటర్నేషనల్‌ సంస్థలకు ఇండియన్లు సీఈవోలు అయ్యారంటూ ప్యాట్రిక్‌ కొలిసన్‌ ట్వీట్‌ చేశారు. టెక్నాలజీ ప్రపంచంలో ఇండియనల్లు అద్భుతాలు చేస్తున్నాడని ప్రశంసించాడు. అయితే అంతటితో ఆగకుండా  ఇంకో మాట జోడించారు. వలస వచ్చిన వారికి అమెరికా అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుందనే విషయాని గుర్తు చేస్తున్నానంటూ  ముక్తాయించారు.  

ప్యాట్రిక్‌ వ్యాఖ్యలకు ఇండియన్‌ ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రా తనదైన శైలిలో బదులిచ్చారు. ప్యాట్రిక్‌ ట్వీట్‌ని రీట్వీట్‌ చేస్తూ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. ఆ రీట్వీట్‌ క్యాప్షన్‌లో ‘ఇది మరో రకమైన ప్యాండెమిక్‌. ఇది ఇండియా నుంచి వచ్చిందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఈ ప్యాండమిక్‌కి కారణం ఇండియన్‌ సీఈవో వైరస్‌. దీనికి వ్యాక్సిన్‌ కూడా లేదు’ అంటూ దీటుగా బదులిచ్చారు. 
 

చదవండి: అమెరికాలో ‘మన’ ఆరుగురి హవా, టాలెంట్‌ భారత్‌ది.. బెన్‌ఫిట్‌ అమెరికాది!

మరిన్ని వార్తలు