యూకే నూతన ప్రధానిపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల జల్లు

24 Oct, 2022 21:44 IST|Sakshi

యూకే ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.  

‘1947లో మన దేశ స్వాతంత్ర్యం వేళ భారత్‌కు చెందిన నాయకుల్ని చిన్నచూపు చూస్తూ యూకే మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయంటూ అవహేళన చేశారు.


కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్‌ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన జవాబు ఇచ్చారు. జీవితం ఎంతో అందమైంది’అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు