ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా..

24 Feb, 2024 20:52 IST|Sakshi

ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇందులో అధునాతన సదుపాయాలతో కూడి ఆశ్చర్యపరుస్తున్న ఓ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూడవచ్చు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో కనిపించే ఎయిర్ పోర్ట్ లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని తెలుస్తోంది. ఇది కొత్తగా నిర్మించిన టెర్మినల్. ఇందులో అద్భుతమైన చిత్రాలు చూపరులను ముగ్దుల్ని చేస్తున్నాయి. 

ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది లక్నో విమానాశ్రయమా? సాంప్రదాయ ఆతిథ్యంలో నగరం ఖ్యాతిని కొత్త శిఖరాలకు తీసుకువెళుతుంది. ఈ నగరాన్ని మళ్ళీ ఇప్పుడు సందర్శించాలనుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి: భారత్‌లో లాంచ్ అయిన కొత్త బైకులు ఇవే..

whatsapp channel

మరిన్ని వార్తలు