బస్సును ఢీకొట్టిన ఎస్‌యూవీ.. ఇలాంటివే మావాళ్లలో స్ఫూర్తిని నింపుతాయి!

25 Mar, 2022 12:29 IST|Sakshi

రోడ్డు మీద ప్రయాణించేప్పుడు ఏమరుపాటుగా ఉండకూడదు. రక్షణ సూత్రాలను తప్పకుండా పాటించాలి. లేదంటే క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ రోడ్డు ప్రమాద దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రెండు మూడు సెకన్లలోనే బస్సు, ప్యాసింజర్‌ వెహికల్‌ నడిరోడ్డు మీద బలంగా ఢీ కొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీనికి సంబంధించి వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో క్లిప్‌పై ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. సాధారణంగానే సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. పైగా ఈ ప్రమాదంలో బస్సును ఢీ కొట్టిన వాహానం ఇటీవల మార్కెట్‌కి వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఓఓ కావడంతో ఆయన స్పందనకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ ప్రమాదంపై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడం గొప్ప ఊరట ఇచ్చింది. అయితే వేగంగా రెండు వాహనాలు ఢీకొట్టినా మహీంద్రా వాహనంలో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతోనే బయటపడ్డట్టు.. వార్తలు వచ్చాయి. సెఫ్టీ విషయంలో మహీంద్రా పాటిస్తున్న ప్రమాణాలు.. వాటిని రుజువు చేసే సంఘటనలు, వార్తలు విన్నప్పుడు కలిగే అనుభూతి వేరు. ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలనే స్ఫూర్తి మా ఉద్యోగుల్లో కలుగుతుందంటూ ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు