ఓహ్‌! నమ్మలేకపోతున్నా.. ఈ బంగారు కొండని ఆనంద్‌ మహీంద్రా ఆశ్చర్యం

12 Jan, 2022 07:55 IST|Sakshi

ఇండియన్లకు పరిచయం అక్కర్లేని ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రా. వేల కోట్ల వ్యాపారాలతో బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ ద్వారా సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. తనకు నచ్చిన విషయాలు,  దేశంలో తాను చూసిన అద్భుతమైన విషయాలను సాటి భారతీయులతో షేర్‌ చేసుకుంటారు. ఈ క్రమంలో సూర్యస్తమయానికి సంబంధించిన ఓ ట్వీట్‌ చేస్తూ.. స్పందించమని నెటిజన్లు కోరారు.

అరుణ వర్ణంలో ఆకాశం
ఆనంద్‌ మహీంద్రా ఇచ్చిన పిలుపుకి దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కన్యాకుమారి మొదలు కశ్మీర్‌ వరకు చాలా మంది తమ ఊర్లు, గ్రామాలకు సంబంధించిన సన్‌సెట్‌ ఫోటోలను అరుణ వర్ణంలో మెరిసిపోతున్న ఆకాశం ఫోటోలను ట్వీట్‌ చేశారు. ఇందులో తనకు నచ్చిన ఫోటోలకు కామెంట్‌ చేస్తూ పోయారు ఆనంద్‌ మహీంద్ర. కొంత సమయం తర్వాత ఇదే నా ఆఖరి స్పందన అంటూ సమాధానం ఇచ్చారు.

బంగారుకొండ
కానీ, ఆ తర్వాత కొద్ది సేపటికే  భైరవీ జైన్‌ అనే ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌ చూసి ఆనంద్‌ మహీంద్రా తన మాట మీద నిలబడలేక పోయారు. సాయంత్రం వేళ హిమలయాల్లో  పంచశీల్‌ శ్రేణి కొండల్లో సూర్యుడు ఒదిగి పోతుంటే.. కిరణాల కాంతి పరావర్తనం చెంది తెల్లని మంచు కొండరు ఒక్కసారిగా బంగారు కొండలుగా మారిపోయాయి. ఆ ఫోటోను చూసిన ఆనంద్‌ మహీంద్రా తిరిగి రీట్వీట్‌ చేశారు. ఈ ఫోటోను రీట్వీట్‌ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు ఆనంద్‌ మహీంద్రా.  బంగారు వర్ణంలో మెరిసిపోతున్న హిమలయాలను చూస్తే ఆనంద్‌ మహీంద్రా మాట తప్పడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. 

చదవండి: స్కార్పియో కావాలన్న కెన్యా పోలీసులు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్‌

మరిన్ని వార్తలు