నమ్మకం ఉంటే చాలు: ఆనంద్‌ మహీంద్ర మోటివేషనల్‌ వీడియో

6 Mar, 2023 16:42 IST|Sakshi

సాక్షి, ముంబై:  మహీంద్ర అండ్‌  మహీంద్ర చైర్మన్‌, పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర మరో స్ఫూర్తి దాయకమైన వీడియోను షేర్‌ చేశారు.  ఎపుడూ సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే ఆయన విజ్ఞాన, వినోద,  ఆధునిక టెక్నాలజీ.. ఇలా ఒకటేమిటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోను, విషయాలను తన ఫోలోవర్స్‌తో పంచుకోవడం అలవాటు. తాజాగా ఆయన చేసిన  వీడియో ఒకటి వైరల్‌గా మారింది. (మహీంద్రా ఇ-రిక్షా నడిపిన బిల్‌ గేట్స్‌ వీడియో వైరల్‌, ఆనంద్‌ మహీంద్ర స్పందన)

నీటిపై ఒక గుర్రం శరవేగంతో పరుగులు తీస్తున్న అందమైన వీడియోను ఆనంద్‌ మహీంద్ర ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఏ పని చేయాలన్నా మన మీద మనకి నమ్మకం ఉండాలి. విశ్వాసం ఉంటే మీరు నీటిపై కూడా నడవవచ్చు. అంతా మన సంకల్పంలోనే ఉంది. మన మనసులోనే ఉంది. సో.. మీ కలసాకారం కోసం ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేయండి అంటూ మండే మోటివేషన్‌ సందేశాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. అయితే దీనిపై కొంతమంది విభిన్నంగా స్పందించారు. అలాంటి ఒక యూజర్ కమెంట్‌, వీడియో‍కు స్పందించిన ఆయన నీటిపై నడవడానికి ప్రయత్ని స్తున్నప్పుడు మల్టీ టాస్కింగ్‌ చేయవద్దు అంటూ చురకలంటించారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు