బిజినెస్‌ మ్యాగ్నెట్‌ అయినా సరే.. మండే పనంటే మొరాయించుడే

15 Nov, 2021 21:25 IST|Sakshi

బిజినెస్‌ మ్యాగ్నెట్‌ అంటే నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. కాలంతో పాటు పరుగులు తీస్తుంటారు. క్షణం కూడా వృధా చేయరు. రెండు వేల రూపాయల నోటు కింద పడితే ఆ నోటు తీస్తే ఒక్క క్షణం వేస్ట్‌ అవుతుందని ఫీలయ్యేంతగా పని చేస్తుంటారని మనం భావిస్తుంటాం. సినిమాల్లో దర్శకులు, పుస్తకాల్లో రచయితలు బిజినెస్‌ మ్యాగ్నెట్‌ పాత్రలను ఇలాగే మలుస్తూ వస్తున్నారు. కానీ నిజ జీవితంలో వాళ్లు సెకన్ల ముల్లుతో పోటీ పడుతూ పని చేస్తుంటారా ? ఈ విషయం తెలియాలంటే మనం బిజిగా ఉండే బిజినెస్‌మేన్‌లనే అడగాలి. కానీ మనకా కష్టం లేకుండానే కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఇండియాలోనే బిజీయెస్ట్‌ బిజినెస్‌మేన్‌లలో ఒకరు పద్మ భూషణ్‌ ఆనంద్‌ మహీంద్రా. 

సోషల్‌ మీడియాలో ఆనంద్‌ మహీంద్రా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక వీకెండ్‌ వచ్చిందంటూ మరో లెవల్‌లో పోస్టులు చేస్తుంటారు. కాగా 2021 నవంబరు 15 సోమవారం ఉదయం ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన వీడియో నవ్వులూ పూయిస్తోంది. కేరళాలో జరిగిన ఆఫ్‌ రోడ్‌ ర్యాలీలో ఓ జీపు బురదగుంటలో చిక్కుకుని ముందుకు కదిలేందుకు మొరాయిస్తుంటే అందులో ఉన్న డ్రైవరు, పక్కన ఉన్న వ్యక్తులు ఆ జీపు ముందుకు వెళ్లేలా సహకరిస్తూ ఉత్సహపరుస్తుంటారు. ఈ వీడియోను ఉదహరిస్తూ మండే మార్నింగ్‌ పని చేయాలంటే ఇలాంటి ఫీలింగే కలుగుతుందంటూ ట్విస్ట్‌ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు