ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్‌!

22 Jan, 2023 13:46 IST|Sakshi

ఆనంద్‌ మహీంద్రా..! ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌. దేశ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఉన్నా తన సత్తా, తెలివితేటలతో  నష్టాల్లో ఉన్న ఏ కంపెనీనైనా లాభాల బాట పట్టించగల మొనగాడు. సోషల్‌ మీడియాలో ఆనంద్‌ మహీంద్రా చేసే ట్వీట్‌కు లక్షల్లో అభిమానులున్నారు. ఆయన ఎప్పుడూ సోషల్‌ మీడియాలో సమకాలిన అంశాలపై స్పందిస్తుంటారు. ఇప్పుడు అదే జరిగింది. 

ప్రస్తుతం ఆయన ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఎన్నిలాభాలు ఉన్నాయో అంతే నష్టాలు ఉన్నాయని, ఇలా డీప్‌ ఫేక్‌ ఏఐ టెక్నాలజీల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. డీప్ ఫేక్ అనేది ఒక రకమైన ఏఐ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ సాయంతో ఫేక్‌ ఇమేజెస్‌, ఆడియో, వీడియోలను క్రియేట్‌ చేయొచ్చు. 

56 సెకన్ల వీడియో క్లిప్‌లో ఓ వ్యక్తి ఏఐని ఉపయోగించి ఫేక్‌ వీడియోని తయారు చేశాడు. ఆ వీడియోలో విరాట్ కోహ్లి, రాబర్ట్ డౌనీ జూనియర్, షారూఖ్ ఖాన్‌లతో సహా వివిధ వ్యక్తులకు తన ముఖాన్ని మార్ఫ్ చేయడానికి ఏఐని ఎలా ఉపయోగపడుతుందో చూపించాడు.ఆ వీడియోని షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా నెటిజన్లకు ఇలాంటి మోసపూరితమైన టెక్నాలజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు