ట్విన్‌ టవర్ల కూల్చివేత, ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌ 

29 Aug, 2022 12:24 IST|Sakshi

మండే మోటివేషన్‌

అహం పేరుకుపోతే..ఇలా కుప్పకూలాల్సిందే: ఆనంద్‌ మహీంద్ర

సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈరోజు నోయిడా జంట టవర్ల కూల్చివేత వీడియోను షేర్‌ చేశారు. అయితే ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఆయన ప్రత్యేకత ఉంది. అహాన్ని జయించకపోతే... అది జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో తెలిపే  అద్భుత సందేశంతో టవర్ల కూల్చివేత వీడియోను షేర్‌ చేశారు. కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్లు కూల్చివేతను జీవిత  సత్యంతో  అన్వయించారు. 

నోయిడా టవర్ల కూల్చివేతను మండే మోటివేషన్‌కు ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, మనలోని ఈగో కొండలా పేరుకుపోతే ఎంత ప్రమాదమో ఈ ఘటన తనకు గుర్తు చేసిందన్నారు. కొండంత ఎత్తుకు చేరిపోయిన అహాన్ని అంతం చేయడానికి పేలుడు పదార్థాల అవససరం పడుతుందంటూ ఆనంద్‌ మహీంద్రా  ట్వీట్ చేశారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహీంద్ర ఆలోచింపజేసే పోస్ట్‌తో ఏకీభవిస్తున్న ట్విటర్‌ యూజర్లు ఆయనను ప్రశంసించారు. మండే మోటివేషన్‌ ట్వీట్‌పై తమదైన శైలిలో కమెంట్‌ చేస్తున్నారు.  తప్పు జరిగిందని అంగీకరించడానికి అహం అడ్డు వస్తుంది. వాస్తవానికి ఏ సమస్యకైనా తొలి పరిష్కారం అహాన్ని జయించడం. అలాకాకుండా ఈగో తిష్టవేసుకుని కూచుందో  ఇహ..దాన్ని కూల్చేందుకు  విస్ఫోటనం తప్పదు అని మరొక యూజర్‌ కమెంట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు