‘అక్కడికి వెళ్లే ధైర్యం చేయలేను’.. వైరల్‌గా మారిన ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌!

12 Nov, 2022 17:53 IST|Sakshi

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా పేరు సోషల్‌ మీడియాలో ఎప్పుడూ వినపడుతూనే ఉంటుంది. బిజినెస్‌ మ్యాన్‌గా ఆయన ఎంత బిజీగా ఉన్న నెట్టింట సమయాన్ని గడుపుతుంటారు. వింతలు, వినోదం, టెక్నాలజీ తదితర అంశాలతో పాటు సామాజిక అవగాహన కల్పించే అంశాలను, వీడియోను  ట్విటర్‌లో షేర్‌ చేస్తూ నెటిజన్లను పలకరిస్తుంటారు. సోషల్‌ మీడియాలో​ అంతగా చురుకుగా ఉంటారు కాబట్టే ఇటీవలే ట్విటర్‌లో ఏకంగా కోటి మంది ఫాలోయర్లను సంపాదించుకున్నారు.  తాజాగా ఆనంద్ మ‌హీంద్రా నెట్టింట ఓ ఫోటోను షేర్ చేశారు. 

ఆ ఫోటోలో ఏముందంటే!
అందులో.. అది వాహనాలు ప్రయాణిస్తున్న ఒక రోడ్‌ ఫోటో. ఆ రోడ్‌ చూసేందుకు ఎంత అద్భుతంగా ఉందో అంతే ప్రమాదకరంగా ఉంది. ఎత్తైన ప్రాంతానికి వెళ్లే రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు క‌దా. మలుపులు ఎక్కువ‌గా  ఉంటాయి. చుట్టూ లోయ‌లు ఉంటాయి. డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఏ మాత్రం ఆజాగ్రత్తగా వ్యవహరించినా క్షణాల్లో ప్రమాదాన్ని పలకరించాల్సి వస్తుంది.

అటువంటి రోడ్డు మీద ప్ర‌యాణం అంటే సాహ‌సం అనే చెప్పాలి. తన ట్వీట్‌లో ఆనంద్‌ మహీంద్రా పర్వత ప్రాంతమైన లడఖ్‌ రోడ్‌ని షేర్‌ చేసి ఈ విధంగా కామెంట్‌ చేశాడు. ‘ఇంతటి అద్భుతమైన ఫోటోని షేర్‌ చేసినందుకు @TravelingBharat ధన్యవాదాలు.  మీరు పంపిన జాబితా నా లిస్ట్‌లో ఉంచుతాను. కానీ ఆ రహదారిలో వెళ్లే ప్రసక్తే లేదు. ఒప్పకుంటున్నా, నేనంత ధైర్యం చేయలేనని’ క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారడంతో నెటిజన్లు పర్వత ప్రాంతంలో వారి వారి ప్రయాణ అనుభవాలను పంచుతూ కామెంట్లు పెడుతున్నారు.

చదవండి: ఐటీలో ఫేక్‌ కలకలం.. యాక్సెంచర్‌ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!

మరిన్ని వార్తలు