భయపెట్టే వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

28 Jan, 2024 20:43 IST|Sakshi

సోషల్ మీడియాలో తరచూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఒక భయపెట్టే వీడియో షేర్ చేశారు. ఈ వీడియో థ్రిల్ కోరుకునే వారికి సరదాగానే ఉండొచ్చు, కానీ.. సామాన్యులలో మాత్రం తప్పకుండా భయం పుట్టిస్తుంది.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో హాట్ ఎయిర్ బెలూన్ గాలిలో ఎగురుతుంటే.. దానికి కింద భాగంలో ఏర్పాటు చేసిన ట్రామ్పోలిన్‌ మీద కొందరు వ్యక్తులు ఎగరడం చూడవచ్చు. ఎయిర్ బెలూన్ నుంచి కిందికి చూస్తేనే మనకు భయమేస్తుంది. కానీ అంత ఎత్తులో ట్రామ్పోలిన్‌పై ఎగరడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి.

గాలిలో ఎత్తు నుంచి కిందికి దూకేవారికి ఇలాంటివి చాలా సాధారణంగా ఉంటాయి. వీడియోలో కనిపించే వ్యక్తులు కూడా సేఫ్టీ గేర్‌తో కూడిన పార్టిసిపెంట్స్. కాబట్టే వారు హ్యాప్పీగా గాలిలో ఎగరగలుగుతున్నారు. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. 'ఇలాంటివి ప్రయత్నించడం నా లిస్టులో లేదు, కానీ ఆదివారం ఉదయం చూడటానికి ఇది సరైన వీడియో' అంటూ ట్వీట్ చేసాడు.

ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది వీక్షించిన ఈ వీడియోను వేలమంది లైక్ చేశారు. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు