'పనిలో ఛాలెంజింగ్ అనిపించినప్పుడు ఇది చూస్తాను' - ఆనంద్ మహీంద్రా

27 Feb, 2024 08:46 IST|Sakshi

దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మండే మోటివేషన్ వేరుతో ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసింది వీడియోలో ఓ నిర్మాణ కార్మికుడు ఎత్తైన ప్రదేశంలో పని చేయడం చూడవచ్చు. ఇది చూసేవారికి కొంత భయాన్ని కలిగిస్తుంది. కానీ చాలామంది జీవితాలు ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటున్నాయని చెబుతోంది. ఈ వీడియో ఎంతోమంది భవన కార్మికుల శ్రమ పట్ల గౌరవాన్ని పెంపోందిస్తుంది.

ఈ వీడియో షేర్ చేస్తూ.. భవన నిర్మాణ కార్మికుడి ఉదయం ఇలా ఉంటుంది. 'నా పని సవాలుగా ఉందని నేను భావించినప్పుడల్లా నేను దీన్ని చూస్తాను' అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో వేలసంఖ్యలో లైక్స్, వ్యూవ్స్ పొందింది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. లైఫ్ అనేది ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదని, ఇలాంటి జాబ్స్ అలాగే ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సవాళ్లను ఎదుర్కొవాలనుకునే వారికి మంచి ఇన్స్పిరేషన్ అని తెలుస్తోంది.

ఇదీ చదవండి: అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. మూడు రోజుల కార్యక్రమాలు ఇవే!

whatsapp channel

మరిన్ని వార్తలు