‘మేడిన్‌ ఇండియా’పై ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్‌

20 Oct, 2023 13:04 IST|Sakshi

తయారీలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మేడిన్‌ ఇండియా ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కళ్లకు కట్టినట్లు చూపించారు.  

టెక్ దిగ్గజం గూగుల్‌ కీలక ప్రకటన చేసింది. తమ ప్రీమియం ఫోన్‌ పిక్సెల్‌ సిరీస్‌ను భారత్‌లో తయారు చేయనున్నట్లు వెల్లడించింది. మేకిన్‌ ఇండియాలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిక్ ఓస్టెర్లో తెలిపారు. ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా’ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గూగుల్‌ నిర్ణయంపై ఆనంద్‌ మహీంద్రా ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు.  

అందులో మేడిన్‌ ఇండియా గురించి తన ఎదురైన తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవల,ఆనంద్‌ మహీంద్రా అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో కాల్స్‌ మాట్లాడేందుకు వీలుగా లోకల్‌ సిమ్‌ కొనుగోలు చేసేందుకు వెరిజాన్‌ స్టోర్‌కి వెళ్లారు. అక్కడ భారత్‌లో తయారైన ఐఫోన్‌ -15 కోసం సిమ్‌ కావాలని అడగ్గా సదరు సేల్స్‌ పర్సన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతను వ్యక్తం చేసిన ఆశ్చర్యం నాకు ఆనందాన్ని కలిగించింది’ అంటూ ఇదే విషయాన్ని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతేకాదు తన వద్ద గూగుల్ పిక్సెల్ ఫోన్ కూడా ఉంది. మేడిన్‌ ఇండియా ‘పిక్సెల్’ విడుదలయ్యాక దాన్నీ తీసుకుంటాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం, ఆ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు