Anand Mahindra:హడావుడి అంతా దాని గురించే, కానీ చాప కింద నీరులా..

29 Jun, 2022 18:30 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెంచాలంటూ కేంద్రం చెబుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే టూ వీలర్‌ సెగ్మెంట్‌లో అయితే కుప్పలు తెప్పలుగా ఈవీ మోడళ్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కార్ల విభాగంలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. అయితే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకపోయినా త్రీ వీలర్‌ విభాగంలో ఈవీ వాహనాల జోరు కనిపిస్తోంది. తాజాగా ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రా చేసిన కామెంట్లు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి.

మహీంద్రా మోటార్స్‌ సక్సెస్‌ఫుల్‌ మోడళ్లలో ఒకటైన స్కార్పియో నుంచి సరికొత్తగా ఎన్‌ సిరీస్‌ రాబోతోంది. మహీంద్రా నుంచి ఈ ప్రకటన రావడం, అందుకు సంబంధించిన వీడియో విడుదల కావడంతో ఒక్కసారిగా ఎన్‌ సిరీస్‌కు ఫుల్‌ క్రేజ్‌ వచ్చింది. నెట్టింటా ఎన్‌ సిరీస్‌ విశేషాలు అంతటా వ్యాపించాయి. ఇదే విషయాన్ని ఆనంద్‌ మహీంద్రా ప్రస్తావిస్తూ.. అందరూ స్కార్పియో ఎన్‌ సిరీస్‌ గురించే మాట్లాడుకుంటుకున్నారు. కానీ మేము చాలా నిశ్శబ్ధంగా ఇంకో విజయాత్సోవాన్ని కూడా జరుపుకున్నామని తెలిపారు.

మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ వెహికల్‌ అమ్మకాలు యాభై వేల మైలు రాయిని దాటాయి. ఈ విశేష సందర్భం స్కార్పియో ఎన్‌ హడావుడిలో మరుగున పడిపోయింది. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారిపోయే క్రమంలో త్రీ వీలర్‌ వాహనాలు చాపకింద నీరులా మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయనే విధంగా ఆనంద్‌ మహీంద్రా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

చదవండి: వారెన్‌ బఫెట్‌: చనిపోయాక కూడా మంచి మనసు చాటుకోవాలనుకున్నాడా?

మరిన్ని వార్తలు