అటల్ సేతుపై ఆ దృశ్యం చూడలేకపోయా - ఆనంద్ మహీంద్రా

7 Feb, 2024 12:26 IST|Sakshi

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న చాలా నగరాల్లో ఒక పెద్ద సమస్య ట్రాఫిక్. ఈ సమస్యలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ముంబై నగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి 'అటల్ సేతు' అందుబాటులోకి వచ్చింది.

భారతదేశంలో సముద్రం మీద నిర్మించిన అతి పెద్ద వంతెన (బ్రిడ్జ్) అయిన అటల్ సేతు మీద ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' ప్రయాణించి.. తన అనుభవాన్ని తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేసారు. ఇందులో అటల్ సేతు బ్రిడ్జికి సంబంధించిన వీడియో కూడా చూడవచ్చు.

గత వారం నేను ముంబై, పూణే మధ్య అటల్ సేతుపైన ప్రయాణించాల్సి వచ్చింది. బ్రిడ్జి మీద ప్రయాణిస్తుంటే.. నీటిపై బోటు మీద ప్రయాణిస్తున్నట్లు అనిపించింది. ఇదో ఇంజినీరింగ్ అద్బుతం. అయితే సాయంత్రం సమయంలో అద్భుతమైన దృశ్యాన్ని నేను చూడలేకపోయానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ.. వీడియో, ఫోటో వంటివి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి: జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే..

అటల్ సేతు గురించి..
ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ నిర్మించిన అటల్ సేతు నిర్మాణానికి రూ.21200 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సుమారు 21.8 కిలోమీటర్ల పొడవైన అటల్ సేతు నిర్మాణం 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రం మీదనే ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడంతో సేవ్రీ నుంచి నవా షేవాకు ప్రయాణించే సమయం 2 గంటల నుంచి 20 నిమిషాలకు చేరినట్లు తెలుస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega