చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్

6 Jan, 2024 21:22 IST|Sakshi

భారతీయ వ్యాపార దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తిరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ కలిగిన దేశాల జాబితాలో భారత్.. చైనాను అధిగమించింది, అమెరికాను చేరుకోవడానికి మరెంతో దూరం లేదని చెబుతూ 'ది వరల్డ్ ర్యాంకింగ్' పోస్ట్ షేర్ చేస్తూ.. 'నితిన్ గడ్కరీ' అమెరికాను త్వరలోనే ఓవర్ టేక్ చేస్తారని ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టులో గమనించినట్లయితే.. భారతదేశం 6,700,000 కిలోమీటర్ల రోడ్డును కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. చైనా 5,200,000 కిమీ రోడ్డును కలిగి ఉండటం వల్ల.. ఇండియా రెండవ స్థానంలో నిలిచింది. చేరిన మూడవ స్థానాన్ని పొందింది.

ఇదీ చదవండి: భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

అగ్ర రాజ్యం అమెరికా విషయానికి వస్తే.. USA 6,832,000 కిమీ రోడ్డు మార్గాలను కలిగి జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇండియా అమెరికాను అధిగమించాలంటే 1,32,000 కిమీ రోడ్డును కలిగి ఉండాలి. రాబోయే రోజుల్లో తప్పకుండా భారత్ అగ్ర స్థానంలో నిలుస్తుందని తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు