'వీళ్ళతో ఎప్పుడూ పెట్టుకోవద్దు' - ఆర్మీ గురించి ఆనంద్ మహీంద్రా ట్వీట్

27 Jan, 2024 15:06 IST|Sakshi

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో సైనిక బృందాలు, నాగ్ క్షిపణులు, టీ-90 భీష్మ యుద్ద ట్యాంకులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపైన అమర్చే మోటార్లు ఇవన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి.

గణతంత్ర వేడుకల్లో సైనిక కవాతు భారతదేశ పరాక్రమాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. దీనికి సంబంధించిన వీడియోను పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. 'ఇతర దేశాల ఆర్మీకి నాదో సలహా.. వీరితో ఎప్పుడూ పెట్టుకోవద్దు' అంటూ ట్వీట్ చేశారు. ఇండియా దృఢంగా ఉందని చెప్పే రెండు ఎమోజీలను కూడా యాడ్ చేశారు.

ఇదీ చదవండి: కొండపై క్రికెట్.. రోడ్డుపై ఫీల్డింగ్ - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. లక్షల మంది వీక్షించిన ఈ వీడియో 23000 కంటే ఎక్కువ లైక్స్ పొందింది. కాగా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో ఇండియన్ ఆర్మీని ప్రశంసిస్తూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు