నేనింకా అప్డేట్ కాలేదేమో! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..

21 Feb, 2024 21:34 IST|Sakshi

దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా జిలేబీ తయారు చేయడంలో టెక్నాలజీకి సంబంధించి ఓ వీడియో షేర్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో 3డీ ప్రింటర్ నాజిల్‌తో జిలేబీలను తయారు చేసే పాకిస్థానీ స్ట్రీట్ షాప్ వారిని చూడవచ్చు. ఇది చూడగానే మనకు కొత్తగా అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా జిలేబీని చేతితోనే వేస్తారు, కానీ ఇక్కడ చూస్తే దీనికి కూడా టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వీడియో షేర్ చేస్తూ.. నాకు జిలేబీ అంటే ఇష్టం, వాటిని చేతితో తయారు చేయడం ఒక ఆర్ట్. ఇక్కడ 3డీ ప్రింటర్ నాజిల్ ఉపయోగించి చేస్తుంటే వెరైటీగా.. కొత్తగా అనిపిస్తుంది. నేను టెక్నాలజీ విషయంలో చాలా అప్‌డేట్‌గా ఉంటాను. ఈ వీడియో చూస్తుంటే ఇంకా నేను అనుకునేదాన్ని కంటే పాతపద్ధతి దగ్గరే ఉండిపోయానేమో / అప్డేట్ కాలేదేమో అనిపిస్తోందని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కేవలం కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూవ్స్ పొందిన ఈ వీడియో వేలసంఖ్యలో లైక్స్ పొందింది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఇదీ చదవండి: మార్చిలో బ్యాంక్ సెలవులు ఇవే - చూసారా..

whatsapp channel

మరిన్ని వార్తలు