UPSC Vs IIT JEE: జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే..

5 Feb, 2024 14:50 IST|Sakshi

భారతదేశంలో అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏదంటే దాదాపు చాలామంది UPSC లేదా ఐఐటీ జేఈఈ అని చెబుతారు. అయితే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ప్రపంచంలో అత్యంత కష్టమైన ఎగ్జామ్ ఏదనే దానికి సంబంధించి 'ది వరల్డ్‌ ర్యాంకింగ్‌' రూపొందించిన ఒక లిస్ట్ పోస్ట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో అత్యంత కఠినమైన పరీక్షగా చైనా నిర్వహించే 'గావోకో పరీక్ష' (Gaokao Exam) అని తెలిసింది. ఆ తరువాత జాబితాలో వార్సుపైగా ఇండియాలో నిర్వహించే IIT JEE, UPSC ఎగ్జామ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.  గేట్ ఎగ్జామ్ కూడా దేశంలో నిర్వహించే కఠినమైన పరీక్షగా ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా 12th ఫెయిల్ సినిమా చూసిన తర్వాత జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కఠినమైన పరీక్ష అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలను కోరారు. ఇందులో కొందరు యూపీఎస్సీ అని, మరి కొందరు జేఈఈ అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ తాను UPSC పరీక్ష రాశానని, ఐఐటీ జేఈఈతో పోలిస్తే యూపీఎస్సీ చాలా కఠినమైందని వెల్లడించారు.

ఇదీ చదవండి: రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్‌చల్‌ చేశాడు - వీడియో

నెటిజన్లు చెప్పిన సమాధానాలను బట్టి చూస్తే తప్పకుండా ర్యాంకింగ్స్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ పోస్ట్.. లెక్కకు మించిన లైక్స్ పొందింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega