ఏం ఐడియా.. మనం కూడా ఇలా చేయగలమా! ఆనంద్ మహీంద్రా

7 Jan, 2024 19:55 IST|Sakshi

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ, ఫాలోవర్స్ ప్రశ్నలకు అప్పుడప్పుడూ స్పందిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. ఒక టీచర్, క్లాస్ రూమ్‌లో కొన్ని వస్తువులను చిందర వందరగా వేయడమే కాకుండా, చైర్స్‌ను కూడా ఎక్కడపడితే అక్కడ వేస్తుంది. ఆ తరువాత పిల్లలను అక్కడికి తీసుకు వస్తుంది. పిల్లలందరూ అక్కడున్న వస్తువులను యధాస్థానాల్లో చేర్చేస్తారు. ఈ వీడియో చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది.

ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఈ వీడియా షేర్ చేస్తూ ఏం ఐడియా.. చిన్నప్పుడే పరిశుభ్రత, చక్కదనం వంటి వాటి గురించి అలవాటు చేస్తున్నారు, మనం కూడా మన ఫ్రీ, ఎలిమెంటరీ స్కూల్స్‌లో చేయగలమా.. అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది, వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ వీడియో మీద కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు