Anand Mahindra: ఈ విషయంలో చైనా, అమెరికాలను వెనక్కి నెట్టిన భారత్‌

26 Nov, 2021 11:06 IST|Sakshi

Anand Mahindra Tweets that India at Top Position In Financial Olympics: అక్షరాస్యత తక్కువని, సరైన ఆర్థికాభివృద్ధి లేదంటూ ఇండియాను చిన్నబుచ్చే దేశాలకు షాక్‌లాంటి వార్తను ప్రజలతో పంచుకున్నారు ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రా. డిజిటల్‌ పేమెంట్స్‌కి సంబంధించి రియల్‌ ట్రాన్సాక‌్షన్స్‌లో అమెరికా, చైనాలను ఇండియా వెనక్కి నెట్టిన వివరాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఫైనాన్షియల్‌ ఒలంపిక్స్‌లో ప్రపంచంలో మరే దేశానికి అందనంత ఎత్తులో ఇండియా ఉందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.  

ఇటీవల ఎకానమిక్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ అనే (ఈఐయూ) సంస్థ ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ పేమెంట్స్‌, రియల్‌ టైం ట్రాన్సాక‌్షన్లకు సంబంధించి సర్వే చేపట్టింది. అందులో ఇండియా 25.5 బిలియన్ల ట్రాన్సాక‌్షన్లతో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. ఇండియా తర్వాత చైనా 15.7 దక్షిణ కొరియా 6, థాయ్‌లాండ్‌ 5.2, జిబ్రాల్టర్‌ 2.8, జపాన్‌ 1.7, బ్రెజిల్‌ 1.3, అమెరికా 1.2 బిలియన్ల రియల్‌టైం ట్రాన్సాక‌్షన్లు ఉన్నట్టు ఈఐయూ ప్రకటించింది. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఊ) సిస్టమ్‌ వచ్చిన తర్వాత ఇండియాలో డిజిటల్‌ పేమెంట్లు ఊపందుకున్నట్టు పేర్కొంది. 

చదవండిసోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారాలు.. లీగల్‌ యాక్షన్‌కు సిద్ధమన్న ఆనంద్‌ మహీంద్రా

మరిన్ని వార్తలు