నిన్న నిర్మలా సీతారామన్‌, నేడు ఆనంద్‌ మహీంద్రా.. ఆకట్టుకుంటున్న క్యూఆర్‌ గంగిరెద్దు

6 Nov, 2021 18:51 IST|Sakshi

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు శరవేగంగా విస్తరించే అవకాశాలే ఉన్నాయంటూ ‘ఇండియా మొబైల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌ 2021 నివేదిక ప్రకటించిన రోజే .. అందులోని అంశాలు నిజమే అన్నట్టుగా ఓ వీడియో నెట్టింట్‌ హల్‌చల్‌ చేస్తోంది. గంగిరెద్దు ఆడించే వ్యక్తులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డబ్బులు స్వీకరిస్తున్నారను. దీనికి సంబంధించిన వీడియో ట్విట​‍్టర్‌లో పోస్ట్‌ చేశారు. 

గంగిరెద్దు తలకు క్యూఆర్‌ కోడ్‌ ఉంచి నగదు స్వీకరిస్తున్న వీడియోను చూసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ శరవేగంతో విస్తరిస్తున్నాయంటూ తన ట్విట్టర్‌ పేజీలో స్పెషల్‌గా పోస్ట్‌ చేశారు. మరుసటి రోజే బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా సైతం ఇదే వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. డిజిటల్‌ పేమెంట్స్‌ భారీ ఎత్తున విస్తరిస్తున్నాయని అని చెప్పడానికి ఇంత కంటే పెద్ద ఉదాహారణ ఏమైనా కావాలా ? అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్‌ చేయగా.. అది కూడా వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు