మీకు నచ్చితే నాదే: ఆనంద్‌ మహీంద్రకు నెటిజన్లు ఫిదా!

12 Jul, 2022 16:44 IST|Sakshi

సాక్షి, ముంబై: ఫన్నీ విడియోలు, విభిన్న ఫోటోలు, పోస్ట్‌లతో సోషల్‌ మీడియా యూజర్లను ఆకట్టుకోవడం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రకు బాగా అలవాటు. అంతేకాదు యూజర్ల ప్రశ్నలకు అంతే చమత్కారంగా బదులివ్వడం కూడా వ్యాపార దిగ్గజానికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా మహీంద్రా షేర్ చేసిన వీడియోలోని వాయిస్ తనదేనా కాదా అని తెలుసుకోవాలనుకునే  ట్విట్టర్ వినియోగదారుడికి  ఆయనిచ్చిన  సమాధానం నెటిజనులను ఆకట్టుకుంటోంది. 

విషయం ఏమిటంటే..ది మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ గురించి  ఒక వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో  టైటిల్స్‌లో వాయిస్‌  ఆనంద్‌ మహీంద్రఅని క్లియర్‌గా మెన్షన్‌  చేశారు. ఆయన నేరేషన్‌లో ఈ వీడియో ​‍ కథనం సాగుతుంది. అయితే “సార్, ఇది మీ వాయిస్?” అని ఒకరు సంభ్రమాశ్చర్యాలతో అడిగారు. దానికి సమాధానంగా  మీకు నచ్చితే నా వాయిస్సే.. నచ్చకపోతే నాది కాదు..(ఊరికే సరదాగా అంటున్నా..అది నా వాయిస్సే) అంటూ రిప్లై ఇచ్చారు మహీంద్ర. దీంతో కమెంట్లు వెల్లు వెత్తాయి. “చివరికి మనం రోజూ చూసే ముఖానికి వాయిస్‌ని లింక్ చేయడం అద్భుతం. మీ డిక్షన్ వాయిస్ క్లారిటీ భలే ఉంది సార్ శుభాకాంక్షలు”  ఒకరు  "వావ్ మీరు వాయిస్ ఆర్టిస్ట్ కావచ్చు సార్" అని మరొకరు వ్యాఖ్యానించారు.

కాగా అట్లాంటాలోని వరల్డ్ ఆఫ్ కోకా కోలా , స్టుట్‌గార్ట్‌లోని మెర్సిడెస్-బెంజ్ మ్యూజియం వంటి కార్పొరేట్ మ్యూజియంలు 1990ల నుండి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. అలాగే గత దశాబ్దంలో అనేక భారతీయ వారసత్వ సంస్థలు, టాటా, అరవింద్ లిమిటెడ్ ఇలాంటి మ్యూజియంలను ప్రారంభించాయి. తాజాగా ఈ జాబితాలో మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ పేరుతో మహీంద్ర కూడా చేరింది. జీవితం స్థిరంగా లేనట్లే, ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచంలో మహీంద్రా గ్రూప్‌కు సంబంధించి ఒక సజీవమైన, శ్వాసించే సంస్థ మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ " అని ఆనంద్‌  మహీంద్రా వెల్లడించారు. ముంబైలోని మహీంద్ర ప్రధాన కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే  ముందస్తు అనుమతితో  దీన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు