ఇలాంటివారి వల్లే అమెరికా అలా మారింది - ఆనంద్‌ మహీంద్రా

3 Jun, 2022 16:45 IST|Sakshi

సామాజిక అంశాలపై స్పందించడం, ప్రతిభ ఉంటే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ప్రోత్సహించడంలో ఆనంద్‌ మహీంద్రా ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ విషయం రుజువైంది కూడా. పల్లెల్లో దాగున్న ప్రతిభను సైతం గుర్తిస్తారు. ఇలాంటి చిన్న చిన్న అంశాలే పెద్ద మార్పులకు దారి తీస్తాయంటున్నారు ఆనంద్‌ మహీంద్రా. 

ప్రతిభకు ప్రతీక
ఆనంద్‌ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్‌ ఏశారు. ఇందులో ఒక కూల్‌డ్రింక్‌ బాటిల్‌, ఒక పొడవైన కర్ర, కొన్ని తాళ్లు/ దారం సాయంతో చెట్టు చిటారు కొమ్మన ఉన్న పళ్లను ఎటువంటి అలుపు లేకుండా సురక్షితంగా కోసే పరికరం తయారీకి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆ వీడియోలో దృశ్యాలు ఈ దేశ సామాన్య పౌరుల ప్రతిభకు ప్రతీగా  కనిపిస్తాయి. ఆ పరికరం అది పని చేసే తీరు చూసి అబ్బుర పడిన ఆనంద్‌ మహీంద్రా వెంటనే తన అభిప్రాయలను ట్విటర్‌లో పంచుకున్నారు.

ఇలాంటి వారి వల్లే
‘ఇదేమీ భూమి బద్దలయ్యేంత బ్రహ్మాండమైన ఆవిష్కరణ కాదు. కానీ ఇది కొత్తగా ఆలోచించాలి, కొత్త ఆవిష్కరణలు చేయాలనే ఆలోచనలు పెరుగున్నాయనడానికి (థింకరింగ్‌) నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే ఈ వీడియో పట్ల నేను ఇంత ఉత్సాహం చూపిస్తున్నాను. ఇలాంటి వారి వల్లే అమెరికా ఈ రోజు గొప్ప దేశంగా నిలిచింది. ఇలాంటి అలవాటు వల్లే అమెరికన్స్‌ తమ ఇంట్లో ఉన్న గ్యారేజీల్లో బేసేమెంట్లలో ఎన్నో సరికొత్త అంశాలను కనిపెట్టారు. ఇలాంటి ఆలోచనాపరులే రేపటి భారీ ఆవిష్కర్తలు’ అంటూ ఆనంద్‌ మహీంద్రా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

చదవండి: Anand Mahindra: ఆవిష్కకర్తలకు ఆనంద్‌ మహీంద్రా సవాల్‌? మీరు రెడీనా..

మరిన్ని వార్తలు