Anant Ambani-Radhika Merchant Engagement: వైభవంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్  నిశ్చితార్థ వేడుక

19 Jan, 2023 19:38 IST|Sakshi

సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ఎంగేజ్మేంట్ వేడుక ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. గుజరాతీ హిందూకుటుంబాలలో తరతరాలుగా అనుసరిస్తున్న గోల్ ధన, చునారి విధి వంటి పురాతన సంప్రదాయాలతో ఈ వేడుకను నిర్వహించారు.

గుజరాతీ హిందూ కుటుంబాలు తరతరాలుగా పాటిస్తున్న గోల్ ధన, చునారి విధి కార్యక్రమాలు కుటుంబ దేవాలయంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గుజరాతీ సంప్రదాయాలలో వివాహానికి ముందు జరిగే వేడుక గోల్ ధన. అంటే ఏంటీ గోల్ ధన అంటే బెల్లం, కొత్తిమీర గింజలు అని అర్ధం. గుజరాతీ సంప్రదాయాలలో వివాహానికి ముందు జరిగే నిశ్చితార్థం లాంటిదే. 

వధువు కుటుంబం బహుమతులు, స్వీట్లతో వరుడి నివాసానికి తరలి వెళ్లి, అక్కడ బంధు మిత్రుల సమక్షంలో ఆపై జంట ఉంగరాలు మార్చుకుంటారు. ఉంగరాలు మార్చుకున్న తర్వాత దంపతులు తమ పెద్దల  ఆశీర్వాదం తీసుకుంటారు.

సాయంత్రం వేడుకలకు అనంత్ సోదరి ఇషా నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు రాధికను ఆహ్వానించడానికి మర్చంట్ నివాసానికి వెళ్లడంతో వేడుకలు ప్రారంభమైనాయి.  ఈ మేరకు రిలయన్స్‌ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అనంత్, రాధికలతోపాటు  కుటుంబసభ్యులు  శ్రీకృష్ణుని దర్శించుకుని సాంప్రదాయ లగ్న పత్రిక లేదా రాబోయే వివాహానికి ఆహ్వానం పఠనం తర్వాత గణేష్ పూజతో విధులను ప్రారంభించడానికి బృందం అక్కడి నుండి వేడుక వేదికకు తరలివెళ్లింది. గోల్ ధన , చునారి విధి తర్వాత అనంత్ రాధిక కుటుంబీకుల మధ్య ఆశీర్వాదాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. 

ముఖేశ్‌ అంబానీ సతీమణి  నీతా అంబానీ నేతృత్వంలో నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటూ విశేషంగా నిలిచింది.  సోదరి ఇషా రింగ్ వేడుక ప్రారంభమైనట్లు ప్రకటించిన వెంటనే అనంత్  రాధిక  ఉంగరాలు మార్చుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంత్, రాధిక  పెళ్లికబురు గత కొన్నిరోజులుగా ప్రత్యేకంగా నిలుస్తోంది.  తాజాగా వివాహబంధంలో కీలకమైన వేడుకను సెలబ్రేట్‌ చేసుకున్నారు .

కాగా బిలియనీర్‌ ముఖేశ్‌ అంబానీ, నీతా కుమారుడు అనంత్ అమెరికాలోని  బ్రౌన్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డ్‌లలో సభ్యునిగా కూడా వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం RIL ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. శైలా, వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక, న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డ్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.ప్రత్యేక దీపాలు,పుష్పాలంకరణతో వేదిక దేదీప్యమానంగా మంగళవారం రాధిక మర్చంట్ మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి  తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు