మమ్మల్ని బయటకు గెంటేశారు: అనన్య బిర్లా

26 Oct, 2020 14:00 IST|Sakshi

మా అమ్మతో దురుసుగా ప్రవర్తించారు: అనన్య బిర్లా

షాకింగ్‌గా ఉంది: నీరజా బిర్లా

వాషింగ్టన్‌: ‘‘స్కోపారెస్టారెంట్‌ నిర్వాహకులు నన్ను, నా కుటుంబాన్ని బయటకు గెంటేశారు. జాతి వివక్ష ప్రదర్శించారు. ఇది నిజంగా విషాదకరం. కస్టమర్ల పట్ల ఇలాంటి వైఖరి సరైంది కాదు. మీ రెస్టారెంటులో భోజనం చేయడానికి మేం మూడు గంటలు ఎదురుచూశాం. కానీ, మీ వెయిటర్‌ జోషువా సిల్వర్‌మాన్‌ మా అమ్మతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు. జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇది అస్సలు సరైంది కాదు. వెరీ రేసిస్ట్‌’’ అంటూ సింగర్, బిర్లా కుటుంబ వారసురాలు‌ అనన్య బిర్లా అమెరికన్‌ రెస్టారెంటులో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తమ పట్ల జాతి వివక్ష చూపిన రెస్టారెంటు నిర్వాహకులకు సోషల్‌ మీడియా వేదికగా చురకలు అంటించారు. (చదవండి: ట్రోలింగ్‌: ‘సంజూ గ్రేట్‌.. పంత్‌ నువ్వు హల్వా, పూరీ తిను’ )

కాగా ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌, బిలియనీర్‌ కుమార్‌ మంగళం బిర్లా కూతురైన అనన్య బిర్లా గాయనిగా, ఆర్టిస్టుగా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం ఆమె తన తల్లి నీరజా బిర్లా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలోని ప్రముఖ ఇటాలియన్‌- అమెరికన్‌ రెస్టారెంటుకు వెళ్లారు. ఈ క్రమంలో భోజనం ఆర్డర్‌ చేసిన తమను, గంటల కొద్దీ వెయిట్‌ చేయించారని, కస్టమర్లన్న కనీస మర్యాద లేకుండా అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెఫ్‌ ఆంటోనియా లొఫాసో నేతృత్వంలోని ఇటాలియన్‌ మూలాలున్న సదరు రెస్టారెంటు నిర్వాహకుల తీరును నెటిజన్ల దృష్టికి తీసుకువచ్చారు.

ఇక కూతురి ట్వీట్‌పై స్పందించిన నీరజా బిర్లా సైతం.. ‘‘ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది.. అత్యంత అనుచితంగా ప్రవర్తించారు. కస్టమర్లతో ఇలా వ్యవహరించేందుకు మీకు ఎలాంటి హక్కు లేదు’’అంటూ రెస్టారెంట్లు నిర్వాహకుల తీరును ఎండగట్టారు. అనన్య సోదరుడు ఆర్యమన్‌ బిర్లా కూడా ఈ విషయంపై స్పందించాడు. గతంలో తమకు ఎన్నడూ ఇలాంటి రేసిస్ట్‌ అనుభవాలు ఎదురుకాలేదని, జాతి వివక్ష ఉందన్న విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా